
కర‍్నూలులో స్వైన్‌ప్లూ కలకలం
కర్నూలు : కర్నూలు నగరంలో స్వైన్‌ప్లూ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వాస్పత్రిలో ఏఎంసీ విభాగంలో ఇద్దరు రోగులకు స్వైన్‌ప్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు వైద్యాధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
వీరితో పాటు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రకాష్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించడంతో అక్కడి వైద్యులు స్వాప్ ద్వారా పరీక్షకు పంపించారు. ఒకే రోజు నగరంలో ముగ్గురు రోగులకు స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించడంతో ఆందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.