
మోపిదేవి, ఇక్బాల్, చల్లా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీమమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి సోమవారం ప్రకటించారు. అనంతరం మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉండటంతో.. ప్రతిపక్ష టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలువలేదు.
కాగా, ఆగస్టు 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించిన ఎన్నికల సంఘం..16వ తేదీన నామినేషన్ల పరిశీలన జరిపింది. 19వ తేదీన(నేడు) నామినేషన్ల ఉప సంహణకు తుది గడవు ముగియడంతో.. బరిలో ఉన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలుపొందినట్టు ప్రకటించింది.