mla elections
-
దుబ్బాక ఎన్నికలు: రంగంలోకి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఓటమిల విషయం కాకుండా టీఆర్ఎస్ ఓటు బ్యాంకుపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అధికార పార్టీ మాత్రం గత ఎన్నికలకు మించిన మెజార్టీని తీసుకు వచ్చేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఏ ఎన్నిక జరిగినా తనదైన శైలిలో ముందుకు వెళ్లే ట్రబుల్ షూటర్ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గెలుపు బాధ్యత భుజాన వేసుకున్నారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వరుసగా 37,925, 62,500 మెజార్టీ వచ్చింది. అయితే ఈ ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. దొమ్మాట నియోజకవర్గంలో అంతర్భాగమైన దుబ్బాక 2009 ఎన్నికల ముందు జరిగిన నియోజవర్గాల పునర్ విభజనతో నియోజకవర్గంగా మారింది. ఇది సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, రాయపోలు, దౌల్తాబాద్, మెదక్ జిల్లాలోని చేగుంట, నార్సింగ్, మండలాలు కలిపి ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,90,483 మంది ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి అతిస్వల్ప మెజార్టీ 2,640తో గెలపుపొందగా.. తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ నుంచి సోలిపేట రామలింగారెడ్డి 2014లో 37,925 మెజార్టీ, 2018లో 62,500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన యాడాదిన్నరతర్వాత జరిగే దుబ్బాక ఉప ఎన్నిక ఆ పార్టీ పని తీరుకు నిదర్శనంగా నిలవనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీన్ని రుజువు చేసేందుకు గతం ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలని టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భారమంతా ఆయనపైనే.. గత ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డికి వచ్చిన ఓట్లకు మించి ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అధినేత మాట చెప్పిందే తడవుగా ఈ బాధ్యతను మంత్రి హరీశ్‌రావు భుజాన వేసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని దాదాపుగా అన్ని గ్రామాలను మంత్రి కలియ తిరిగారు. అంతటితో ఆగకుండా మండలాలకు ఎమ్మెల్యే స్థాయి నాయకులను ఇన్చార్జిలుగా నియమించారు. అదేవిధంగా తనదైన శైలిలో కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువతతో సమీక్షలు, సభలు నిర్వహంచి టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. ఇక నుంచి సిద్దిపేట, దుబ్బాకలు నాకు రెండు కళ్లులాంటివని, దుబ్బాకపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఏ చిన్న అవకాశం కూడా జారవిడువకుండా చూడాలని, భారీ మెజార్టీతో టీఆర్ఎస్ను గెలిపించి అధినేతకు బహుమతిగా ఇవ్వాలని క్యాడర్‌కు ఆయన పిలుపు నిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారం ముమ్మరం చేసిన టీఆర్ఎస్ మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రచారం జోరు మరింత పెంచేందుకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. -
ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీమమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి సోమవారం ప్రకటించారు. అనంతరం మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉండటంతో.. ప్రతిపక్ష టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలువలేదు. కాగా, ఆగస్టు 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించిన ఎన్నికల సంఘం..16వ తేదీన నామినేషన్ల పరిశీలన జరిపింది. 19వ తేదీన(నేడు) నామినేషన్ల ఉప సంహణకు తుది గడవు ముగియడంతో.. బరిలో ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలుపొందినట్టు ప్రకటించింది. -
కోడ్ రానున్న నేపథ్యంలో పదవుల పందేరం!
సాక్షి, తాడేపల్లిగూడెం: ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ పథకానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శ్రీకారం చుట్టినట్టుగా కనపడుతోంది. మరో వారం రోజుల్లో ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూలు దాదాపుగా విడుదల కానుందనే సంకేతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పార్టీలో ఉండేదెవ్వరో., గోడ దూకేదెవ్వరో తెలియని సందిగ్ధ స్థితి నెలకొని ఉంది. ఉన్న వాళ్లను కాపాడుకునే క్రమంలో అసంతృప్తులను చల్లార్చుకొనేందుకు పదవుల పందేర కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఈ క్రమంలో త్వరలో గూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీని ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా నియామకపు ఉత్తర్వులు ఇస్తారని తెలుస్తోంది. పెంటపాడుకు చెందిన డీసీసీబి డైరెక్టర్ దాసరి అప్పన్న సతీమణి దాసరి కృష్ణవేణికి చైర్మన్ పదవి కట్టబెట్టడానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం. వైస్ చైర్మన్‌గా పట్టణంలోని 32వ వార్డుకు చెందిన రామిశెట్టి సురేష్‌ను నియమిస్తారని తెలుస్తోంది. గతంలో వీసీ పదవికి రాజీనామా చేసిన గొర్రెల శ్రీధర్‌కు ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పదవినిచ్చి ఆకర్ష పథకాన్ని అమలు చేసింది. విధులు, నిధులు లేని టైలర్స్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఆకాశం స్వామిని నియమించారు. మునిసిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం పోటీపడి ఫలితం పొందలేక పోయిన కాపు సామాజిక వర్గానికి చెందిన 32వ వార్డు కౌన్సిలర్ రామిశెట్టి సురేష్‌కు ఏఎంసీ వైస్ చైర్మన్ పదవిని ఇవ్వడం ద్వారా సైకిల్ దిగి వెళ్లకుండా టీడీపీ కట్టడి చేసుకున్నట్టుగా కనపడుతోంది. -
నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ఖరారు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపికచేసే పనిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిమగ్నమయ్యారు. నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నపరెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు, మంత్రులతో కేసీఆర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. జిల్లా నేతలు, మంత్రులతో చర్చించిన అనంతరం నల్లగొండ స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థిగా చిన్నపరెడ్డిని బరిలో దించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. -
పోరు రసవత్తరం
సాక్షి ప్రతినిధి, కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక అసలు పోరు మొదలయింది. శుక్రవారానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చివరకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి డి.వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, మరో ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులు దండుశేషు యాదవ్, వి.వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. అయితే ప్రధాన పోటీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికార టీడీపీ మధ్యనే నెలకొంది. ఇక పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతుండటంతో ఎలాగైనా గెలిచేందుకు అధికార పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకోసం ఓటుకు నోటు ఇచ్చేందుకు బరితెగిచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గెలిచేందుకు అవసరమైన బలం లేకపోయినప్పటికీ... బరిలో నిలిచి గెలుపునకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మొదట ఓటుకు లక్ష ఆఫర్ చేసి.. తాజాగా ఈ రేటును కాస్తా రెండు లక్షలకు పెంచినట్టు తెలుస్తోంది. మరోవైపు ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు ఒక స్వతంత్య్ర అభ్యర్థిని అధికార పార్టీయే రంగంలోకి దించినట్టు సమాచారం. పెరుగుతున్న రేటు వాస్తవానికి జిల్లాలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అధికంగా ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే విజయావకాశాలు అధికం. ఒకవైపు గెలిచేందుకు అవసరమైన ఓట్లు లేకపోవడం అధికార పార్టీ టీడీపీకి గుబులు పుట్టిస్తోంది. దీంతో ఓటు రేటును కాస్తా అమాంతం పెంచేసింది. మొన్నటి దాకా ఓటుకు లక్ష ఆఫర్ చేసిన అధికార పార్టీ.. తాజాగా ఈ రేటును రూ.2 లక్షలకు పెంచేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బనగానపల్లె, ఆదోని నియోజకవర్గాల్లో ఈ తరహా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా గెలవాల్సిందేనన్న అధిష్టానం ఆదేశాల నేపథ్యంలో జిల్లా టీడీపీ నేతలు తమ శాయశక్తులా ప్రలోభాల పర్వానికి తెరలేపారు. దారికి రాని వారిని బెదిరించే చర్యలకూ పాల్పడుతున్నారు. బెదిరింపుల పర్వం షురూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కంటే అధికార టీడీపీకి 80 ఓట్ల బలం తక్కువగా ఉంది. అయినప్పటికీ బరిలో నిలిచిన నేపథ్యంలో ఓటుకు ఇంత రేటు చొప్పున తీసుకుని ముందుకు వస్తే సరే.. లేనిపక్షంలో బెదిరింపుల పర్వానికీ అధికార పక్షం తెరలేపింది. మంత్రాలయం నియోజకవర్గంలో పెద్దకడుబూరు మండలంలోని కల్లుకుంటకు చెందిన స్వతంత్య్ర ఎంపీటీసీ అభ్యర్థి హసీనా భానును ఇప్పటికే అధికార పార్టీ తమవైపు రావడం లేదని బెదిరింపులకు దిగింది. పత్తికొండ, డోన్, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో అదే తరహా బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. -
'ఎమ్మెల్యేగానే.. ఎమ్మెల్సీగా పోటీ చేయను'
హైదరాబాద్ : ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని... ఎమ్మెల్సీగా పోటీ చేయని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా మిత్రులతో తలసాని శ్రీనివాసయాదవ్ చిట్‌చాట్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కాదా... ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ పదవి చేపడతారా అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు తలసాని శ్రీనివాస యాదవ్ పైవిధంగా స్పందించారు. తెలంగాణలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస యాదవ్ మళ్లీ ఎన్నికల పోటీ చేసేందుకు బయపడుతున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాజీనామా చేసినట్లు సభలో ప్రకటించాలని ఆయన తలసానికి సవాల్ విసిరారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తలసాని రాజీనామా డ్రామా ఆడుతున్నారని సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. ఈ అంశాన్ని కూడా శ్రీనివాసయాదవ్ వద్ద మీడియామిత్రులు ప్రస్తావించారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు. అనంతరం టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ఇప్పటి వరకు తన రాజీనామాను ఆమోదించుకోలేకపోయారు. దీంతో తలసాని వైఖరిపై పలు రాజకీయ పార్టీల వారు ఆరోపణలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. -
ఎన్నికల వేళ ''వేలు'' లొల్లి