జోగిపేట, న్యూస్‌లైన్: రూ.500 నోట్లను చూస్తే జోగిపేట వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఎంత దగ్గరి బంధువులు ఇచ్చినా అనుమానంగా చూస్తున్నారు. ఏకంగా వాటిని గుర్తించేందుకు పలువురు వ్యాపారస్తులు స్కానింగ్ యంత్రాలను కొనుగోలుచేస్తున్నారు. దీనికి కారణం ఈ ప్రాంతంలో దొంగనోట్ల చెలామణి అధికంగా ఉండడమే. వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పత్తి కొనుగోలు చేసేం దుకు వచ్చిన వ్యాపారస్తులు రైతులను దొంగనోట్లతో నిలువునా మోసం చేస్తున్నారు. ఇటీవల జోగిపేట ప్రాంతానికి చెందిన రైతు మద్నూర్ ప్రాంతంలో పత్తిని విక్రయించగా వారు ఇచ్చిన డబ్బులతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అతడు రూ.500 నోటును తీసుకొని కిరాణదుకాణానికి వెళ్లగా అనుమానం వచ్చిన కిరాణదారుడు స్కానింగ్ మిషన్‌లో పరీక్షిం చాడు. దీంతో అది దొంగనోటుగా తేలింది.
ఈ విషయం చెప్పడంతో రైతు తనకు పత్తి విక్రయదారుడు ఇచ్చిన అన్ని నోట్లను స్కాన్ చేయిం చాడు. అందులో రూ.5 వేల వరకు దొంగ నోట్లుగా తేలింది. దీంతో బాధిత రైతు లబోదిబోమన్నాడు. స్థానికంగా ఉన్న దుకాణాలలో రోజుకో చోట రూ.500, రూ.1000 నోట్లు వస్తూనే ఉన్నాయి. దీంతో వ్యాపారస్థులు ఈ నోట్లను చూస్తే చాలు వణికిపోతున్నారు. బ్యాంకుల్లో కూడా వచ్చిన నోట్లను అధికారులు గుర్తించి పెన్నుతో కొట్టేసి తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలిసింది. గత సంవత్సరం కూడా పుల్కల్ మండలం చౌటకూర్ గ్రామంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులు రూ.15 నుంచి 20 వేల వరకు దొంగనోట్లు వచ్చాయి. తర్వాత గుర్తించిన రైతులంతా వారి వద్దకు పరుగులు తీసిన విషయం పాఠకులకు విదితమే. స్థానిక పెట్రోల్ బంక్‌లల్లో ఎవరైనా రూ.500 నోటు ఇస్తే వారి వాహనం నంబరును కూడా ఆ నోటుపై రాసి పెడుతున్నారు.
ఇటీవల పోసానిపేటకు చెందిన ఒక రైతు టాక్టర్ కిరాయిగా మూడు వెయ్యి రూపాయల నోట్లను ట్రాక్టర్ యజమానికి ఇవ్వగా అవి దొంగనోట్లు అని తేలడంతో ఈ వ్యవహరం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లినట్లు సమాచారం. దొంగనోట్లు వస్తుండడంతో ఆందోళన చెందుతున్న వ్యాపారస్థులు చేసేదిలేక డబ్బు లు లెక్కించే మిషన్‌లు కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలో ఇప్పటికే 20 నుంచి 30 వరకు మిషన్‌ల కొనుగోలు చేసినట్లు తెలిసింది. పోలీస్‌శాఖ దొంగనోట్లకు సంబంధించి ప్రత్యే క నిఘాను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారస్థులు, ప్రజలు కోరుతున్నారు.
దొంగనోట్ల కలకలం
Published Sat, Dec 7 2013 11:37 PM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
Advertisement
Advertisement