వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పార్టీ నేత బీ. ఎర్రిస్వామి రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు.
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పార్టీ నేత బీ. ఎర్రిస్వామి రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు.
సీమాంధ్ర ఎంపీలను దురుద్దేశంతో సస్పెండ్ చే శారని ఆరోపించారు. ఎంపీలను సస్పెండ్ చేస్తే ఇక లోక్‌సభలో సమైక్యాంధ్రపై మాట్లాడే వారెవరుంటారని ప్రశ్నించారు. విద్యా, వ్యాపార సంస్థలు బంద్‌కు సహకరించాలని కోరారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు నగరంలోని నందిని హోటల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకోవాలని సమైక్యవాదులకు పిలుపునిచ్చారు.