అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన బిల్లుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో చేపట్టే బంద్‌ను విజయవంతం చేయాలని అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో డివిజన్ కన్వీనర్లతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాలతో పాటు, అన్ని మండల కేంద్రాల్లో బంద్ చేపట్టాలన్నారు. మొదటి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్సార్ సీపీ అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించాలన్నారు.
సమైక్యాంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయంగా కార్యోన్ముఖులవ్వాలన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్, టీడీపీలు బోగస్ ఓటర్లను సృష్టించడమే కాక, అర్హులైన ఓటర్లను తొలగించేలా ఫిర్యాదులు చేస్తున్నాయని వాటిపై నిఘా ఉంచాలన్నారు. డివిజన్ కమిటీలను పూర్తి చేయాలన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం అందరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. నిత్యం ప్రజాసమస్యలపై ఉద్యమించాలని కన్వీనర్లకు సూచించారు.
కార్యక్రమంలో పార్టీ అనుంబంధ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, ఉపాధ్యక్షురాలు ప్రమీలమ్మ, మైనార్టీ విభాగ ం రాష్ట్ర కార్యదర్శి షెక్షావలి, యువజన విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి పరుశురాం, నగరాధ్యక్షుడు మారుతీప్రకాష్, యువజన విభాగం నగరాధ్యక్షుడు మారుతీనాయుడు, నాయకులు గోవింద్‌రెడ్డి, మహానందరెడ్డి, విజయశాంతి, లక్ష్మీశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.