
అనంతపురం: గ్రామ, వార్డు వలంటీర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం ఎంపీడీఓలు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈనెల 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 25న స్క్రూటినీ నిర్వహిస్తారు. 27 నుంచి 29 వరకు ఎంపిక చేసి అర్హత సాధించిన వారికి లెటర్లు పంపుతారు. ఎంపికైనవారు మే 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. జిల్లాలో మొత్తం 15,254 గ్రామ వలంటీర్లు పోస్టులుండగా... ప్రస్తుతం 675 పోస్టులు ఖాళీగా ఉన్నాయని జిల్లా పంచాయతీ అధికారి రామనాథరెడ్డి తెలిపారు.
గ్రామ వలంటీర్ల ఖాళీల వివరాలు..
అమడగూరు 3, అమరాపురం 13, అనంతపురం రూరల్ 40, ఆత్మకూరు 18, బత్తలపల్లి 9, బెళుగుప్ప 3, బొమ్మనహాళ్æ 7, బ్రహ్మసముద్రం 11, బుక్కపట్నం 13, బుక్కరాయసముద్రం 15, చిలమత్తూరు 14, చెన్నేకొత్తపల్లి 5, డి.హీరేహాళ్ 12, ధర్మవరం రూరల్ 24, గాండ్లపెంట 2, గార్లదిన్నె 7, గుత్తి 9, గోరంట్ల 18, గుడిబండ 8, గుమ్మఘట్ట 3, గుంతకల్లు 12, హిందూపురం 16, కదిరి 5, కళ్యాణదుర్గం 17, కంబదూరు 12, కనగానపల్లి 17, కణేకల్లుæ 13, కొత్తచెరువు 6, కూడేరు 13, కుందుర్పి 11, లేపాక్షి 5, మడకశిర 7, ముదిగుబ్బ 12, ఎన్‌పీ కుంట 13, నల్లచెరువు 6, నల్లమాడ 6, నార్పల 12, ఓడీ చెరువు 7, పామిడి 14, పరిగి 12, పెద్దపప్పూరు 12, పెద్దవడుగూరు 15, పెనుకొండ 8, పుట్లూరు 13, పుట్టపర్తి 7, రామగిరి 8, రాప్తాడు 11, రాయదుర్గం 3, రొద్దం 23, రొళ్ల 7, శెట్టూరు 10, శింగనమల 4, సోమందేపల్లి 14, తాడిమర్రి 4, తాడిపత్రి 12, తలుపుల 5, తనకల్లు 9, ఉరవకొండ 15, వజ్రకరూరు 11, విడపనకల్లు 9, యాడికి 18, యల్లనూరు 7.
393 వార్డు వలంటీర్ల పోస్టులు..
అనంతపురం సెంట్రల్: అనంతపురం కార్పొరేషన్, అన్ని మున్సిపాలిటీల్లోనూ 393 వార్డు వలంటీర్ల పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో భర్తీ ప్రక్రియ పూర్తికాగా, మరికొన్ని వాటిలో కసరత్తు చేస్తున్నారు.
వార్డు వలంటీర్ల పోస్టుల వివరాలు..
అనంతపురం 72, హిందూపురం 120, కళ్యాణదుర్గం 66, తాడిపత్రి 50, ధర్మవరం 54, కదిరి 6, పెనుకొండ 8, రాయదుర్గం 7, పుట్టపర్తి 5, మడకశిర 5.
Comments
Please login to add a commentAdd a comment