నిచ్చెన మీదుగా రాకపోకలు సాగిస్తున్న పాలక శ్యామల, ఇంటి ముందు తీసిన భారీ గొయ్యి
కాశీబుగ్గలోని హడ్కో కాలనీకి చెందిన ఈ బాలుడు మూడు నెలలుగా ఇలాగే నిచ్చెన ఎక్కి ఇంటికి వెళ్తున్నాడు. నిచ్చెన కింద పది అడుగుల గొయ్యి ఉంది. కుటుంబమంతా ఇలాగే అవస్థలు పడుతోంది. ఎందుకంటే..
శ్రీకాకుళం ,కాశీబుగ్గ: మరుగుదొడ్ల నిర్మాణం నిరుపేదలను ముప్పుతిప్పలు పెట్టిస్తోంది. కట్టేందుకు సరైన స్థలం, సరిపడా డబ్బులు లేకపోయినా సంక్షేమ పథకాల్లో కోత విధిస్తారన్న భయం, బిల్లులు మంజూరు చేస్తారన్న ఆశతో గొయ్యిలు తవ్విన వారికి నిరాశే ఎదురవుతోంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు హడ్కోకాలనీలో పాలక శ్యామల, శంకరరావులు తమకు సరైన స్థలం లేకపోయినా మరుగుదొడ్డి కోసం ఇంటి ముందే భారీ గొయ్యిలు తవ్వారు. అయితే మొదటి విడత బిల్లులు ఇంతవరకు రాకపోవడంతో తదుపరి పనులు చేపట్టలేదు. ఇప్పటికి మూడు నెలలవుతున్నా అధికారులు స్పందించకపోవడంతో నిచ్చెనలు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉండటంతో గోతుల్లో పడే ప్రమాదముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment