ఎండలపై ఓ కంట్రోల్ రూం.. టోల్ ఫ్రీ నెంబరు!
విశాఖపట్నం: భానుడి తాపానికి తెలుగు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఎక్కడ ఏ సమయంలో ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా యంత్రాంగం మొత్తం అప్పమత్తమైంది. ప్రజలను ఎండల బారి నుంచి రక్షించాలని సంకల్పించింది. గతంలో ఎన్నడూ లేకుండా తొలిసారి ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేసి దానికి 180042500002 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించింది.
మండల ఎమ్మార్వోలంతా కలసి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని డీఆరోవో నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. నగర పరిధిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని గ్రేటర్ కమిషనర్కు కూడా లేఖ రాశారు. అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉపాధి హామీ పనుల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.