రెండు గంటలు ట్రాఫిక్ స్తంభన
ప్రకాశం బ్యారేజీపై శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు నరకం అనుభవించారు. బ్యారేజీని పరిశీలించేందుకు వంశధార ట్రిబ్యునల్కమిటీ సభ్యులు రావడంతో కొద్దిసేపు ఇరువైపులా రాకపోకలు నిలిపివేశారు. కమిటీ పరిశీలన అనంతరం వాహనాలను వదలడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. కమిటీ సభ్యులు, మంత్రి దేవినేని ఉమా వాహనాలతో పాటు అంబులెన్‌స కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది.
రెండు గంటలు ట్రాఫిక్ స్తంభన
ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజీపై ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు రెండు గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఒక అంబులెన్స్‌లో మహిళ ప్రసవ వేదన అనుభవించింది. అయినా.. పోలీసులు అరగంట వరకు ట్రాఫిక్‌ను క్లియర్ చేయలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ సతీష్ చంద్ర , మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకున్నారు.