విశాఖపట్నం : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విశాఖ ఎంవీపీ డబుల్ రోడ్డులో ఉన్న గిరిజన భవన్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇటీవల ఎన్నికయిన ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా సన్మానించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు గిరిజన సమస్యలపై మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకునేందుకు ఉద్యమాలు చేపడతామన్నారు. గిరిజనలకు ఆటవీ హక్కుల చట్టాలను ప్రభుత్వాలు కచ్చితంగా అమలు చేయాలన్నారు.
గిరిజన ఉద్యోగులు, సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గిరిజనుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో ‘1/70, పీసా, అటవీ హక్కుల చట్టాలను కచ్చితంగా అమలుచేయాలని కోరారు. ఏజెన్సీలోని ప్రతి మండల కేంద్రంలో ఇంగ్లిష్ మీడియం సూళ్లను ఏర్పాటు చేయాలని, ఆటవీ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని, గిరిజన జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్లు శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.
విశాఖ మన్యంలో గిరిజ యూనివర్శిటీని నెలకొల్పాలన్నారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యేలను సత్కరించారు. అనంతరం ఏయూలో ఎమ్మె స్సీ బోటనీ (డిస్టెన్స్)లో గోల్డ్‌మెడల్ సాధించిన ఎల్.బి.దివ్యజ్యోతికి ఏయూ ఉద్యోగులు నగదుతో పాటు షీల్డును అందజేశారు. ఆదివాసీ రిజర్వేషన్ సంరక్షణ సేవా సంఘం అధ్యక్షుడు ఆర్.ఎస్.దొర పాల్గొన్నారు.
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
Published Sun, Aug 10 2014 2:33 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement