
'జేసీ, కేశినేని బస్సులు ఎందుకు ఆగటం లేదు'
హైదరాబాద్ : సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మె ఎందుకు చేస్తున్నారో చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సమ్మె వల్ల తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ కోతల పెడితే ఊరుకునేది లేదని ఆయన గురువారమిక్కడ హెచ్చరించారు. సీమాంధ్రలో ఆర్టీసీ బస్సులు ఆగినా జేసీ, కేశినేని బస్సులు ఎందుకు ఆగలేదని ప్రశ్నించారు. బంద్ నుంచి చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థలకు ఎందుకు మినహాయించారో చెప్పాలని హరీష్ రావు ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు నేటి నుంచి 72 గంటల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.