కనీస ఖర్చులకూ సరిపోనివేతనం..గర్భం దాల్చిన భార్య.. ఎలా పోషించాలో తెలియకదిగులు.. ఆఖరుకు భార్యకు అబార్షన్ చేయించాలనే ఆలోచన.. ఈ పరిస్థితులు ఓ చిరుద్యోగిమనసును కల్లోలం చేశాయి.
చివరికి అతను ఆత్మహత్యచేసుకున్నాడు. కుమారుడివిషాదాంతంతో తల్లడిల్లిన తల్లి కూడా పరనిందతో తనువుచాలించింది. రెండు నిండు ప్రాణాలు బలైన సంఘటనబుధవారం తిరుపతిలోసంచలనం రేకెత్తించాయి. మృతునికి చాలీ చాలని వేతనం చెల్లిస్తున్న టీటీడీ పై విమర్శలుచెలరేగాయి.
తిరుపతి (అలిపిరి): తిరుపతిలో బుధవారం తల్లీకుమారుల ఆత్మహత్య సంఘటన చర్చనీయాంశమైంది. పర్సాల వీధికి చెంది న బి. గంగాధర్ (25) తన తండ్రి మరణాంతరం వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగంలో పనిచేస్తున్నాడు. ఇతని తల్లి కుమారి(45) నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేస్తోంది. ఇద్దరివీ తక్కువ వేతనాలు కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. కుటుం» పోషణకు తల్లి కొంత మొత్తాన్ని బ్యాంకులో అప్పుగా తీసుకుంది. మూడు నెలల క్రితం గంగా ధరానికి అదే ప్రాంతానికి చెందిన దివ్యతో వివాహం జరిపించారు.
వివాహానికి కొంత మంది దగ్గర అప్పు తీసుకున్నారు. ఆర్ధిక వెతల వల తల్లీకొడుకుల మధ్య వివాదాలు వచ్చేవి. ఇటీవల దివ్య గర్భం ఘోషిస్తున్నాయి. స్వామి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పిం చడంలోనూ ధార్మిక సంస్థ యాజమాన్యం, ఉన్నతాధికారులు వైఫల్యం చెందారు. ఈ కారణంగానే కార్మికులు మానసిక వేదనకు గురై తనువు చా లించే స్థితికి చేరుతున్నారు. పనికి తగిన వేతనం అందక ఓవైపు, పని ప్రాంతాల్లో అధికారుల వే ధింపులు మరోవైపు కార్మికుల పాలిట శాపాలుగా మారాయి. బా«ధితుల నుంచి అందే ఫిర్యాదులకు స్పందించి కార్మికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన టీటీడీ విజిలెన్స్ విభాగం సైతం తమకెందుకు అనే ధోరణితో వ్యవహరిస్తోంది.
రెండు దశాబ్దాలు గడుస్తున్నా పెరగని వేతనాలు..
టీటీడీలోని 28 విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1998లో చేరిన కార్మికులకు రెండు దశాబ్దాలు గడుస్తున్నా వేతనాలు పెరగక ఇబ్బందులు పడుతున్నారు. 1998లో రూ.4,500గా ఉన్న కనీస వేతనాలు ప్రస్తుతం రూ.6,500 వరకు మాత్రమే అందుతోందంటే కార్మికుల ఆర్థిక సమస్యలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టీటీడీ వార్షిక బడ్జెట్ సుమారు రూ.3వేల కోట్లు దాటుతున్నా అందుకు ప్రత్యక్షంగా సహకరిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచేందుకు మాత్రం అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు నిత్యం ఎదురయ్యే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే దారులు లేక మృతి చెందేందుకు సిద్ధమవుతున్నారన్న వాదనలు లేకపోలేదు. ప్రతి సమస్యకూ చావే కారణం కాకున్నా ధార్మిక సంస్థలోని అధికారుల అధర్మ విధానాలకు మాత్రం కార్మికులు మృత్యుపాలయ్యేందుకు ప్రేరేపిస్తున్నాయనడంలో సందేహం లేదు.
పని ప్రాంతాల్లోనూ వేధింపులే..
ఓ వైపు కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులు, మరోౖ పు ఉద్యోగం చేస్తున్న విభాగాల్లో చా లని వేతనాలతో పాటు కార్మికులకు పని ప్రాంతాల్లో వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో భాగంగానే గత ఏడాది ఔట్ సోర్సింగ్ సెల్‌లో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ఉద్యోగులపై అధికారి వెకిలి చేష్టలు, లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పురుష కాంట్రాక్ట్ కార్మికులు సైతం ఆయా విభాగాల్లోని అధి కారుల వేధింపులు, సూటిపోటి మాటలను భరి స్తూ ఉద్యోగాలు కొనసాగిస్తున్నారు.
అధికారులు కళ్లు తెరవాలి
టీటీడీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయినప్పటికీ ప్రతి అంశానికీ ప్రభుత్వంపై నెపంవేసే విధానాన్ని మార్చుకోవాలి. రాజకీయ ప్రమేయం ధార్మిక సంస్థలో ఉన్నన్నాళ్లు కాంట్రాక్ట్ కార్మికుల గోడు వినిపించుకునేవారు ఉండరు. అలాంటప్పుడు ధార్మిక సంస్థ అనే పేరుకు సార్థకత ఉండదు. అధికారులు కళ్లు తెరవాలి.– టి.సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్
మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలి
టీటీడీలోని మహిళా కార్మికులకు పూర్తి రక్షణ కల్పించే విధంగా మార్పులు తేవా లి. వేధింపుల విషయంలో అధికారులు నిఖార్సుగా వ్యవహరించి చర్యలు తీసుకుంటే తప్పులకు ఆస్కారం ఉండదు. కనీస వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కార్మికుల స్థానంలో అధికారులే పనులు చేస్తే కార్మికుల ఘోష ఏంటో తెలిసి వస్తుంది.– రుద్రరాజు శ్రీదేవి,మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment