తిరుమల: సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేస్తోంది. వారికి పారదర్శకంగా గదులు కేటాయిస్తోంది. గదులు దొరకని భక్తులకు యాత్రికుల వసతి సముదాయాల్లో ఉచితంగా లాకర్ సౌకర్యం కలి్పస్తోంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్‌లో ఇటీవల అందుబాటులోకి వచి్చన పద్మనాభ నిలయంతో కలిపి మొత్తం 5 యాత్రికుల వసతి సముదాయాలున్నాయి. ఇక్కడ ఉచితంగా లాకర్లు కేటాయిస్తారు. యాత్రికులు తమ సామగ్రిని ఇందులో భద్రపరుచుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లి రావచ్చు.
విశాలమైన హాళ్లలో చక్కగా విశ్రాంతి పొందొచ్చు. ఇక్కడ తలనీలాల సమర్పణకు మినీ కల్యాణకట్ట, మరుగుదొడ్లు, స్నానపు గదులు, జల ప్రసాదం, అన్నప్రసాదం తదితర సౌకర్యాలు ఉన్నాయి. అద్దె గదులు దొరకని వారు పీఏసీల్లో సౌకర్యవంతంగా బస చేయవచ్చు. రిసెప్షన్ పరిధిలోని పీఏసీ–1, పీఏసీ–2, కౌస్తుభం, నందకం, జీఎన్‌సీ, పద్మావతి కౌంటర్, ఎస్వీ విశ్రాంతి గృహం, హెచ్‌వీసీ, సప్తగిరి విశ్రాంతి సముదాయాల వద్ద యాత్రికులు తలనీలాలు సమరి్పంచేందుకు మినీ కల్యాణ కట్టలు ఉన్నాయి.
అందుబాటులో దిండ్లు.. దుప్పట్లు
అన్ని వసతి గదులు, íపీఏసీల్లో భక్తులకు ప్రత్యేక కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కిట్లలో చాపలు, దిండ్లు, దుప్పట్లు, ఉన్ని కంబళి ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో బస చేసే యాత్రికులు వీటిని అదనంగా పొందొచ్చు. ఒక రోజుకు 2 చాపలకు రూ.10, కవర్లతో కలిపి 2 దిండ్లకు రూ.10, ఒక దుప్పటికి రూ.10, ఒక ఉన్ని కంబళికి రూ.20 సేవా రుసుం వసూలు చేస్తారు. భక్తులు వీటిని బాగా వినియోగించుకుంటున్నారు.
అన్నిచోట్లా స్వైపింగ్ యంత్రాలు
శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం, ఎంబీసీ, టీబీ కౌంటర్ (కౌస్తుభం), సీఆర్వో కార్యాలయంలోని సీఆర్వో జనరల్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచారు. వీటిని యాత్రికులు బాగా వినియోగించుకుంటున్నారు. దీనివల్ల చిల్లర సమస్య కూడా తీరినట్లవుతోంది. పద్మావతి కౌంటర్‌లో 97 శాతం, ఎంబీసీలో 100 శాతం, టీబీ కౌంటర్‌లో 91 శాతం, సప్తగిరి విశ్రాంతి గృహాల వద్ద 62 శాతం, సూరాపురం తోట, రాంభగీచా, సీఆర్వో జనరల్ వద్ద దాదాపు 50 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి.
సామాన్య భక్తుల కోసం 10 కల్యాణ మండపాలు
సామాన్య భక్తులు వివాహాలు చేసుకునేందుకు వీలుగా వసతి కల్పన విభాగం పరిధిలో ఎస్‌ఎంసీ వద్ద 6, ఏటీసీ వద్ద ఒకటి, టీబీసీ వద్ద 3 కలిపి మొత్తం 10 కల్యాణ మండపాలున్నాయి. 90 రోజుల ముందు నుంచి వీటిని కరంట్ బుకింగ్‌లో పొందవచ్చు. ఎస్‌ఎంసీ వద్ద రూ.200, ఏటీసీ వద్ద రూ.500, టీబీసీ వద్ద రూ.200 అద్దె ఉంది. ఇందుకోసం వధువు లేదా వరుడి తల్లిదండ్రులు సీఆర్వోలోని ఆర్వో–1 ఏఈవోను సంప్రదించాల్సి ఉంటుంది. ఇందుకు వరుడు, వధువు వయసు ధ్రువీకరణ పత్రం కాపీని సమర్పించాలి. వివాహం చేసుకునే వారు తప్పనిసరిగా హిందువులై ఉండాలి.
అందరికీ వసతి కల్పించడమే లక్ష్యం
తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికీ వసతి కలి్పంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. రద్దీ అధికంగా ఉన్న సమయంలో టీటీడీ సముదాయాల్లోనే బస చేయాలని భక్తులను కోరుతున్నాం. పీఏసీ హాల్‌లో చాపలు, దిండ్లు వుంటాయి. గదులు దొరకని భక్తులు లాకర్ తీసుకుని వీటిని వినియోగించుకోవచ్చు.
– ఏవీ ధర్మారెడ్డి, అడిషనల్ ఈవో, టీటీడీ
Comments
Please login to add a commentAdd a comment