ఇద్దరి అరెస్ట్ పరారైన మరికొందరు కూలీలు
చంద్రగిరి: శేషాచలం అటవీ ప్రాంతంలోని శ్రీవారి మెట్టు సమీపంలో శుక్రవారం రెండు కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి మెట్టు సమీపంలో శుక్రవారం ఉదయం స్పెషల్ టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గుర్రాలబావి వద్ద సుమారు 80 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను మోసుకెళ్తూ అధికారులకు తారసపడ్డారు. కూలీలను నిలువరించేందుకు అధికారులు ప్రయత్నించారు. అధికారుల రాకను పసిగట్టిన కూలీలు దుంగలను అక్కడే పడేసి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. వారిని వెంబడించి త మిళనాడు క్రిష్ణగిరి జిల్లా సెన్నూరు గ్రామానికి చెందిన గోవిందరాజన్, భూపాలన్ అనే కూలీలను అదుపులోకి తీసుకున్నారు. కూలీలు పడేసి వెళ్లిన 64 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. సమాచారం అందుకున్న రాయలసీమ రేంజ్ ఐజీ వేణుగోపాలకృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎర్రచందనం దుంగలను ఎలా తరలించారన్న సమాచారాన్ని టాస్క్‌ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ భాస్కర్ నుంచి తెలుసుకున్నారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు భాస్కర్, వాసులను అభినందించారు.
శేషాచలం అంతా నిఘా
శేషాచలం అంతా నిఘా పెట్టామని రాయలసీమ రేంజ్ ఐజీ గోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. నాలుగు నెలలు గా శేషాచలం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా కాకుం డా ఎక్కడిక్కడ దుంగలను స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. గత నాలుగు రోజులుగా కూంబింగ్‌ను ముమ్మరం చేసామని తెలిపారు. శేషాచలం చట్టూ మూడు మీటర్ల వెడల్పుతో కందకాలను త వ్వినా కూడా స్మగ్లర్లు వాటిని చా లా సులభంగా అధిగమించి ఎర్రచందనాన్ని తరలించేం దుకు సాహసిస్తున్నారని తెలిపారు. ఎర్రచందనాన్ని పరిరక్షించడానికి మరో 50 మందిని అదనంగా శేషాచలం అట వీ ప్రాంతంలోకి విధులు నిర్వహించడానికి నియమిస్తామ ని చెప్పారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి ప్రస్తుతమున్న యస్‌యల్‌ఆర్ ఆయుధాలే కాకుండా పంప్ యాక్షన్ ఆయుధాలను ఇస్తామని ప్రకటించారు.
కూంబిగ్ నేపధ్యంలో స్మగ్లర్లు అధికారులపై ప్రతిఘటిస్తే వారిపై తీసుకొనే చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. కూలీలు ప్రవేశించే మార్గాల్లో గట్టి భద్రతను, సీసీ కెమరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతకముందు డెప్యూటీ కన్వజరేటర్ ఆఫ్ పారెస్ట్(డీసీఎఫ్) బియన్‌యన్ మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను ఆరా తీశారు. తిరుపతి వెస్ట్ డిఎస్పీ శ్రీనివాసులు, చంద్రగిరి సీఐ శివప్రసాద్, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు భాస్కర్, వాసు, డీఆర్‌వో నరశింహరావు, ఎఫ్‌బీవో కోదండం పాల్గొన్నారు.
రెండు కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
Published Sat, Sep 26 2015 5:35 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
Advertisement
Advertisement