చేవెళ్ల డీఎస్పీ కె.శిల్పవల్లి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న శ్రీధర్‌ను నియమించారు.
చేవెళ్ల/ శంషాబాద్, న్యూస్‌లైన్: చేవెళ్ల డీఎస్పీ కె.శిల్పవల్లి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న శ్రీధర్‌ను నియమించారు. 2012 మార్చి 2న చిత్తూరు నుంచి బదిలీ అయి చేవెళ్ల డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శిల్పవల్లి 20 నెలల పాటు విధులను నిర్వర్తించారు. చేవెళ్ల డీఎస్పీగా నియమించబడిన శ్రీధర్ రెండుమూడు రోజుల్లో చార్జి తీసుకోనున్నట్లు సమాచారం. శిల్పవల్లి ఎక్కడికి బదిలీ అయ్యారో తెలియరాలేదు. అదేవిధంగా శంషాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ సైతం బదిలీ అయ్యారు. శ్రీనివాస్ రెండేళ్లు ఇక్కడ ఏసీపీగా పనిచేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరు బాధ్యతలు చేపట్టలేదు. ఆక్టోపస్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రేశ్వర్ మరో రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది.