వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ సమీపంలోని నల్లవాగు బ్రిడ్జి పై గురువారం చోటుచేసుకుంది. నెల్లూరుకు చెందిన ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ రోజు నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. కారు నల్లవాగు బ్రిడ్జి వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రకాశం జిల్లా, ప్రసాద్, రోడ్డు ప్రమాదం