జిల్లాలోని నిరుద్యోగులకు తీపి కబురు. గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలోని నిరుద్యోగులకు తీపి కబురు. గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ర్టంలోని 2200పైగా గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ఏపీపీఎస్‌సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాకు 104 పోస్టులు వచ్చాయి. అభ్యర్థులు జనవరి 4 నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజును జనవరి 20వ తేదీలోపు చెల్లించాలి. పరీక్ష ఫిబ్రవరి 23న జరగనుంది. ఇదిలా ఉండగా పోస్టుల భర్తీకి అవసరమైన రిజర్వేషన్ల వివరాలను జిల్లా యంత్రాంగం మేలోనే ఏపీపీఎస్‌సీకి పంపింది. మరిన్ని వివరాలను www.apspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు.