సంక్షోభంలో విశ్వవిద్యాలయాలు | Universities crisis | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో విశ్వవిద్యాలయాలు

Published Sat, Jun 28 2014 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

సంక్షోభంలో విశ్వవిద్యాలయాలు

సంక్షోభంలో విశ్వవిద్యాలయాలు

యూనివర్సిటీ క్యాంపస్ : చాలీచాలని నిధులు.. సిబ్బందికి అరకొర వేతనాలు.. సరిగా జరగని తరగతులు.. విశ్వవిద్యాలయాలపై పట్టుకోల్పోయిన అధికారులు.. విద్యార్థులపై ఫీజుల భారం.. ఇవీ తిరుపతిలోని విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న పరిస్థితులు. దీంతో విశ్వవిద్యాలయాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.

ప్రముఖ ఆధ్యాత్మిక నతరమైన తిరుపతిలో శ్రీవెంకటేశ్వరస్వామి విశ్వవిద్యాల యం, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత వి ద్యాలయంతోపాటు శ్రీవెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ, ఎస్వీ వ్యవసాయ కళాశాల, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ మెడికల్ కళాశాల ఉన్నాయి.

ఈఏడాది నుంచి శ్రీపద్మావతి మెడికల్ కళాశాలను కూడా ప్రారంభించింది. ముఖ్యంగా నగరంలోని ఎస్వీయూ, మహిళా, వేదిక్, వెటర్నరీ వర్సిటీల్లో అధ్యాపకులు లేక చదువులు దెబ్బతింటున్నాయి.నాన్‌టీచింగ్ నియామకాలు కూడా జరగలేదు. దీనివల్ల పీజీ, పీహెచ్‌డీలు పూర్తి చేసిన విద్యార్థు లు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు.
 
ఎస్వీయూలో..

ఎస్వీ యూనివర్సిటీలో 600 మంది అధ్యాపకులకు గాను ప్రస్తుతం 300 మంది మాత్రమే ఉన్నారు. ఎస్వీయూలో అధ్యాపక నియామకాలు జరిగి ఏడు సంవత్సరాలు గడిచింది. అలాగే నాన్‌టీచింగ్ పోస్టుల భ ర్తీ జరగక 25 సంవత్సరాలైంది. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగ విరమణ చేశారు. 292 మంది ఎన్‌ఎంఆర్ ఉద్యోగాలు, 345 మంది టైమ్‌స్కేలు ఉద్యోగులు మాత్రమే దిక్కయ్యారు.
 
ఆర్థిక పరిస్థితులు : ఎస్వీయూనివర్సిటీకి సుమారు రూ.300 కోట్ల నిధులు అవసరమైతే అందులో ప్రభుత్వం రూ.100 కోట్లు మాత్రమే ఇస్తోంది. ఈ నిధులు సిబ్బంది వేతనాలకే పరిపోతాయి. ఈ నేపథ్యంలో 200 కోట్ల లోటును పూడ్చుకోవడంలో భాగంగా విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపుతున్నారు. అలాగే ప్రిన్సిపాల్, హాస్టల్ అకౌంట్‌లలో విద్యార్థుల సంక్షేమానికి వాడాల్సిన నిధులను ఎస్వీయూ అధికారులు తమ ఖాతాల్లోకి తీసుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టారు. యూనివర్సిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  హాస్టళ్లలో భోజనం చేయడానికి కార్డు విధానం ప్రవేశపెట్టారు. డబ్బు ఉన్న విద్యార్థి మాత్రమే భోజనం చేయాల్సిన పరిస్థితి దాపురించింది.
 
మహిళా విశ్వవిద్యాలయంలో..
 
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 127 మంది అధ్యాపకులు అవసరం కాగా ప్రస్తుతం 85 మంది మాత్రమే పనిచేస్తున్నారు.  నాన్‌టీచింగ్ ఉద్యోగులు 169 మంది పనిచేస్తున్నారు. 38 మంది టైమ్ స్కేల్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 48 పోస్టులు ఖాళీగా వున్నాయి. దీంతో ఈపోస్టులను ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో నింపుతున్నారు.
 
ఆర్థిక పరిస్థితులు : బడ్జెట్ విషయానికి వస్తే గత ఏడాది రూ.41 కోట్లకు ప్రతిపాదనలు పంపితే 25 కోట్లు ఇచ్చారు. ఆర్థికలోటు వల్ల ఉద్యోగులకు రావాల్సిన కొన్ని రాయితీలను, సంక్షేమ పథకాలను ఈ ఏడాది వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాది రూ.92 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఏమేరకు నిధులు ఇస్తుందో చూడాలి.
 
వెటర్నరీలో..
 
శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలో 120 మంది అధ్యాపకులు అవసరం కాగా ప్రస్తుతం 40 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇటీవల అధ్యాపక నియామకాలు జరిపినప్పటికీ ఎక్కువ మందిని కోరుట్ల, ప్రొద్దుటూరు, గన్నవరం కళాశాలలకు కేటాయించారు. తిరుపతిలోని కళాశాలకు ఎక్కువ మందిని కేటాయించలేదు. ఇక్కడ కూడా నాన్‌టీచింగ్ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఏడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వేదిక్ విశ్వవిద్యాలయం వీసీ మినహా మిగిలిన వారంతా డెప్యుటేషన్‌పై వచ్చినవారే. అలాగే చాలామంది తాత్కాలిక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. టీటీడీ సహకారం ఉన్నందువల్ల ఈ విశ్వవిద్యాలయానికి నిధుల కొరత లేదు. అయితే విశ్వవిద్యాలయంలో మానవ వనరుల కొరతతో సతమతమవుతుండగా విద్యార్థులు ఫీజుల భారంతో ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement