ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలపై కాంగ్రెస్ అధిష్టానం బజారు స్థాయి చర్చలు నడుపుతోందని ఆమె అన్నారు. సమైక్యానికి సైంధవుడిలా అడ్డుపడింది ముఖ్యమంత్రి కిరణ్ కాదా అని వాసిరెడ్డి ప్రశ్నించింది. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేస్తే విభజన ఆగేది కాదా అని అన్నారు.
రాజ్యాంగ సంక్షోభం సృష్టించమంటే ఎందుకు నోరు మెదపటం లేదని వాసిరెడ్డి సూటిగా ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని కాంగ్రెస్ వివాదంలోకి లాగుతోందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ మురికి నిర్ణయాలకు రాజ్యాంగ వ్యవస్థలు బలి కావాలా అని అన్నారు. సోనియాని విమర్శిస్తే జైలుకు వెళతానని చంద్రబాబుకు భయమని వాసిరెడ్డి ఎద్దేవా చేశారు. సమైక్యం అన్న ఒక్కమాట మాట్లాడటానికి బాబూ... మీ నాలుక మడత పడుతుందా అన్నారు. కిరణ్, చంద్రబాబులు తెలుగు ప్రజల పాలిట చీడ పురుగులని ఆమె వ్యాఖ్యానించారు.