సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై మరోమారు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా వీరులు కరకట్ట మీద వాలారట! ఇక కృష్ణా నదికి కూడా కోవిడ్ టెస్టులు చేయాలేమో! అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
‘సలహాలు, సూచనలు అంటూ జూమ్‌లో రోజూ ఊదరగొట్టావు కదా! ఏడాది పాలన పై వైఎస్ జగన్ స్వయంగా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరై మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తుంటే.. అలా కరకట్ట దారి పట్టారేమిటి జ్ఞానీ?’ అంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ 65 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. దీంతో రెండు నెలల తర్వాత ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. మార్చి 20న చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో చంద్రబాబు తన కుటుంబంతో హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఇక కరోనాతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలు సైతం వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment