
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్ తీరుపై ట్విటర్ వేదికగా వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ‘‘తండ్రీకొడుకులు 'అవినీతి' గురించి మాట్లాడుతుంటే గుంటనక్కలు నీతి బోధలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. అవినీతి పునాదుల మీద లేచిన బతుకులు మీవి’’ అంటూ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ‘‘అహింస, న్యాయం, ధర్మంపై నక్కలు ఊలపెడితే అసహ్యంగా ఉంటుంది. అగాధంలోకి జారిపడి, శిఖరంపై ఉన్నవారిపై ఉమ్మి వేయాలని చూస్తే మీ మీదే పడుతుందని’’ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
వారు ఇదే బాపతు..
‘‘ఏ రాజకీయ పార్టీలో అయినా ప్రజాభిమానం కలిగిన నేతలను, యువతను ప్రోత్సహిస్తారు. అలా చేస్తేనే ఆ పార్టీ మనుగడ కొనసాగుతుంది. పప్పు నాయుడు కోసం ప్రజాక్షేత్రంతో సంబంధం లేని, గెలుపు అంటే తెలియని నాయకులకు పెద్ద పీట వేస్తున్నాడు చంద్రబాబు. యనమల, సోమిరెడ్డి, వర్ల ఇదే బాపతు’’ అంటూ మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.
తండ్రీకొడుకులు ‘అవినీతి’ గురించి మాట్లాడుతుంటే గుంట నక్కలు నీతి బోధలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అవినీతి పునాదుల మీద లేచిన బతుకులు మీవి. అహింస, న్యాయం, ధర్మంపై నక్కలు ఊల పెడితే అసహ్యంగా ఉంటుంది. అగాధంలోకి జారిపడి, శిఖరం పైనున్న వారిపై ఉమ్మి వేయాలనే చూస్తే మీ మీదే పడుతుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 3, 2021
చదవండి: ‘గుట్ట’ కాయస్వాహా: టీడీపీ నేత భూ బాగోతం..
రైతుకు ఫుల్ ‘పవర్’
Comments
Please login to add a commentAdd a comment