సాక్షి, అమరావతి : ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా నిజాయితీ ఉండదని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కర్మ కాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి ఉంటే కరోనా కేసులను వేలల్లో చూపించి, ప్రాణనష్టం లేకుండా చేశా అని దేశమంతా డప్పుకొట్టుకుని తిరిగేవాడని ధ్వజమెత్తారు. పాజిటివ్ రోగులను దాచాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగానికి ఏం అవసరమని ప్రశ్నించారు. మనవడితో ఆడుకోక మధ్యలో ఈ చిటికెలెందుకు అని ట్వీట్ చేశారు.
‘పనీపాట లేకపోవడమో, మీడియాలో కనిపించాలనే ప్రచారం పిచ్చి వల్లనో...లాక్ డౌన్ సమయంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ జరపడం చంద్రబాబుకే చెల్లింది. మీరు వాళ్లకు ఏం టాస్క్ ఇచ్చారు? ఈ సమయంలో వాళ్లు ఏం చేయగలరో ఆలోచించారా? దేశంలో ఎక్కడా ఇటువంటి వింతలు కనిపించవు’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
‘హైదరాబాద్‌లో ఉంటున్నావు. పోలీసు పాస్ తీసుకుని అక్కడి పేద ప్రజలకు ఏదైనా సాయం చేయొచ్చుగదా చంద్రబాబూ! ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు నిత్యావసరాలు పంపిణీ చేసి పేదలకు అండగా నిలుస్తున్నారు. అక్కడ ఆశ్రయం పొందుతున్నందుకైనా కొంత బాధ్యత తీసుకోవాలి గదా!’ అంటూ మరో ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment