
రాయవరం (మండపేట) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తు‘ఫాన్’తో అడ్రస్ లేకుండాపోయిన తెలుగుదేశం పార్టీపై ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ సెటైర్లు పేలుతున్నాయి. అందులో ప్రధానంగా ‘23’ సంఖ్య ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆ అంకె చంద్రబాబునాయుడుకు అస్సలు అచ్చిరాకపోవడమే. ‘23’ సంఖ్య చంద్రబాబుకు తీవ్ర పరాభవాన్ని మిగల్చడమే కాక.. టీడీపీ పుట్టి ముంచిందనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో 23 మందిని సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ తరఫున గెలిచిందీ 23మంది ఎమ్మెల్యేలే. అది కూడా 23వ తేదీనే కావడం విశేషం. దీంతో ఈ 23వ సంఖ్యే చంద్రబాబు కొంప ముంచిందని నెటిజెన్లు చేస్తున్న కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment