పక్కాఇండ్ల కోసం నిరీక్షణ | waiting for houses | Sakshi
Sakshi News home page

పక్కాఇండ్ల కోసం నిరీక్షణ

Published Wed, Jan 13 2016 1:45 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

waiting for  houses

పేదలకు గుడిసెలే దిక్కు
నామ మాత్రంగా 250 వుంజూరు చేసిన సర్కారు
ఇంకా ఎదురు చూస్తున్న వారు 1,528

 
 పక్కా ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదల ఆశలపై సర్కారు నీళ్లు చల్లింది. ఒక్కో ఇంటికి రూ 2.5 లక్షలు ఇస్తామని నాయకులు, అధికారులు ఊదర గొడుతున్నా  ఎప్పటికి పేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తారన్నది శేష ప్రశ్నగా మిగిలింది.
 
 శాంతిపురం:  కుప్పం నియోజకవర్గానికి ప్రభుత్వం 1,250 మరుగుదొడ్లను వుంజూరు చేసిందని, శాంతిపురం మండలానికి అందులో 250 ఇస్తారని నాయుకులు చెబుతున్నారు. అనధికారికంగా లబ్ధిదారుల ఎంపికను పసుపు చొక్కాలు ఇప్పటికే పూర్తి చేశారుు. ఇతర అర్హతలన్నీ పక్కన పెట్టి, పార్టీ కార్యకర్తలు, నాయుకుల బంధువులకే పంచిపెట్టినట్టు వివుర్శలు ఉన్నారుు. అరుుతే రెండు రోజుల క్రితం పూర్తరుున జన్మభూమిలో తవుకు గూడు కావాలని వురో 1,528 కుటుంబాలు వినతి పత్రాలు ఇచ్చారుు. దాదాపు రెండేళ్లుగా ఒక్క ఇళ్లు కూడా వుంజూరు చేయుని ప్రభుత్వం ఇప్పుడు 250  వూత్రమే ఇవ్వటంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పుడు ఎదురు చూస్తున్న వారందరికీ ఇండ్లు రావటానికి వురో 15 ఏళ్లు పడుతుందని వాపోతున్నారు.
 
ఎదురు చూపులు  ఇంకెన్నాళ్లు ?:

చిన్నారిదొడ్డి పంచాయుతీలోని కొండతివ్మునపల్లిలో కొన్ని కుటుంబాలు దుర్బర స్థితిలో జీవితాలను గడుపుతున్నారుు.  వికాలంగుడైన వుునివెంకటప్పకు పూరి పాకే ఇంద్రభవనం. భార్య కూలీ పనులు చేసి, తాను గ్రావుంలో చిన్నాచితక పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. ఏళ్ల తరబడి అధికారులు, నాయుకులను వేడుకొంటున్నా వీరికి రేషన్‌కార్డు గానీ, వికలాంగుల ఫించను గానీ దక్కలేదు.  గ్రావూనికి చెందిన సుబ్రవుణ్యం తన భార్య వెంకటలక్ష్మి, బిడ్డతో సహా పూరింట్లో కాలం గడుపుతున్నాడు. ఇదే గ్రావూనికి చెందిన వెంటేశు, వుునిరత్నవ్ములు ఓ బాత్‌రూంలో అద్దెకు ఉంటూ రాళ ్లబూదగూరులో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. కాయు కష్టంతో తవు కొడుకు శివకువూర్(14)ను చదివించేంచే ప్రయుత్నంలో ఉన్నారు. ఇలాంటి నిరుపేదల సొంతింటి కలను పాలకులు ఎప్పటికి నిజం చేస్తారో వేచి చూడాల్సిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement