selection of beneficiaries
-
ప్రజా ప్రతినిధులే ఫైనల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధులే కీలక పాత్ర పోషించనున్నారు. లబ్ధిదారులను అధికారులు ప్రాథమికంగా ఎంపిక చేసిన తర్వాత జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో తుది జాబితా సిద్ధం కానుంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు, కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ షురూ కానుంది. దీంతో గురువారం నుంచి దాదాపుగా అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన సూచనలతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయికి తరలివెళ్లింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, ఎంఏయూడీ, హౌసింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది అర్హులను గుర్తించడంలో బిజీగా ఉన్నారు. ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. 21, 22 తేదీల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించనున్నారు. అర్హులు, అనర్హుల జాబితాను ఈ సభల్లో ప్రకటించే అవకాశం ఉంది. 23, 24 తేదీల్లో జిల్లా స్థాయిల్లో తుది జాబితా సిద్ధం కానుంది. తుది జాబితాను రూపొందించే క్రమంలో ప్రజా ప్రతినిధుల నిర్ణయం కీలకం కానుంది. స్థానికంగా ఉన్న రాజకీయ, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అర్హుల ఎంపికలో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించనున్నారు. ఎమ్మెల్యేల సిఫారసులతో తుదిరూపు దిద్దుకున్న జాబితా ఇన్చార్జి మంత్రి ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఆ జాబితా ప్రకారమే 26వ తేదీన లబ్ధిదారుల ప్రకటన ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెపుతున్నాయి. భూభారతిలోకి సాగు యోగ్యం కాని భూములు రైతుభరోసా పథకం కింద సీజన్‌కు రూ. 6,000 చొప్పున వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ప్రస్తుతం ఫీల్డ్ సర్వే జరుగుతోంది. సాగు యోగ్యం కాని భూములను రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల వ్యవసాయ విస్తరణాధికారులు పరిశీలించి, భూ భారతి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసి గ్రామసభల్లో నివేదిస్తారు. గ్రామసభల్లో వచ్చే విజ్ఞాపనల ఆధారంగా స్థానిక ఎమ్మెల్యే ఆమోదంతోనే అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా నమోదై ఉండి సంవత్సరంలో కనీసం 20 రోజుల పాటు వ్యవసాయ కూలీగా పనిచేసిన వారి కుటుంబాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఒక కుటుంబంలో ఎంత మంది కూలీలు ఉన్నా, ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఒక్కో సీజన్‌కు రూ.6 వేల చొప్పున రెండు సీజన్లకు ఏటా రూ.12 వేలు ఈ పథకం కింద చెల్లించనున్నారు. ఈ మేరకు అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించే పనిలో అధికారులున్నారు. అయితే కుటుంబాన్ని నిర్ధారించేందుకు రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే రేషన్‌కార్డులు గత కొన్నేళ్లుగా అప్డేట్ కాకపోవడంతో కుటుంబంలోని వారికి పెళ్లిళ్లై, వేర్వేరు కుటుంబాల్లో నివసించే పక్షంలో వారిని గుర్తించడంలో గ్రామసభలు కీలకం కానున్నాయి. ఇక్కడ వచ్చిన ఫిర్యాదులు, సూచనలను కూడా స్థానిక ఎమ్మెల్యేల దృష్టికే తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు! ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేలో ఏ కుటుంబానికి రేషన్‌కార్డు లేదనేది సిబ్బంది నమోదు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 20 లక్షల కుటుంబాలు కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తుండగా, కార్డుల్లో పేర్ల చేర్పుల కోసం లక్షలాది మంది వెయిటింగ్లో ఉన్నారు. ఎమ్మెల్యేలకు రేషన్‌కార్డుల అంశం కీలకం కాబట్టి అర్హులైన వారందరికీ ఇప్పించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఓ ప్రజా ప్రతినిధి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతోనే తిప్పలు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతి నియోజకవర్గంలో కొత్తగా ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇప్పటికే ఫీల్డ్ సర్వే కూడా పూర్తయింది. లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. కాగా ఒక్కో గ్రామం నుంచి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారనేదే ప్రధాన సమస్యగా మారనుంది. ఇప్పటికే సొంత స్థలం ఉన్న వారికి తొలి ప్రాధాన్యత అని ప్రభుత్వం చెప్పడంతో ఎమ్మెల్యే విచక్షణ మేరకు ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పక్కాఇండ్ల కోసం నిరీక్షణ
పేదలకు గుడిసెలే దిక్కు నామ మాత్రంగా 250 వుంజూరు చేసిన సర్కారు ఇంకా ఎదురు చూస్తున్న వారు 1,528 పక్కా ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదల ఆశలపై సర్కారు నీళ్లు చల్లింది. ఒక్కో ఇంటికి రూ 2.5 లక్షలు ఇస్తామని నాయకులు, అధికారులు ఊదర గొడుతున్నా ఎప్పటికి పేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తారన్నది శేష ప్రశ్నగా మిగిలింది. శాంతిపురం: కుప్పం నియోజకవర్గానికి ప్రభుత్వం 1,250 మరుగుదొడ్లను వుంజూరు చేసిందని, శాంతిపురం మండలానికి అందులో 250 ఇస్తారని నాయుకులు చెబుతున్నారు. అనధికారికంగా లబ్ధిదారుల ఎంపికను పసుపు చొక్కాలు ఇప్పటికే పూర్తి చేశారుు. ఇతర అర్హతలన్నీ పక్కన పెట్టి, పార్టీ కార్యకర్తలు, నాయుకుల బంధువులకే పంచిపెట్టినట్టు వివుర్శలు ఉన్నారుు. అరుుతే రెండు రోజుల క్రితం పూర్తరుున జన్మభూమిలో తవుకు గూడు కావాలని వురో 1,528 కుటుంబాలు వినతి పత్రాలు ఇచ్చారుు. దాదాపు రెండేళ్లుగా ఒక్క ఇళ్లు కూడా వుంజూరు చేయుని ప్రభుత్వం ఇప్పుడు 250 వూత్రమే ఇవ్వటంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పుడు ఎదురు చూస్తున్న వారందరికీ ఇండ్లు రావటానికి వురో 15 ఏళ్లు పడుతుందని వాపోతున్నారు. ఎదురు చూపులు ఇంకెన్నాళ్లు ?: చిన్నారిదొడ్డి పంచాయుతీలోని కొండతివ్మునపల్లిలో కొన్ని కుటుంబాలు దుర్బర స్థితిలో జీవితాలను గడుపుతున్నారుు. వికాలంగుడైన వుునివెంకటప్పకు పూరి పాకే ఇంద్రభవనం. భార్య కూలీ పనులు చేసి, తాను గ్రావుంలో చిన్నాచితక పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. ఏళ్ల తరబడి అధికారులు, నాయుకులను వేడుకొంటున్నా వీరికి రేషన్‌కార్డు గానీ, వికలాంగుల ఫించను గానీ దక్కలేదు. గ్రావూనికి చెందిన సుబ్రవుణ్యం తన భార్య వెంకటలక్ష్మి, బిడ్డతో సహా పూరింట్లో కాలం గడుపుతున్నాడు. ఇదే గ్రావూనికి చెందిన వెంటేశు, వుునిరత్నవ్ములు ఓ బాత్రూంలో అద్దెకు ఉంటూ రాళ ్లబూదగూరులో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. కాయు కష్టంతో తవు కొడుకు శివకువూర్(14)ను చదివించేంచే ప్రయుత్నంలో ఉన్నారు. ఇలాంటి నిరుపేదల సొంతింటి కలను పాలకులు ఎప్పటికి నిజం చేస్తారో వేచి చూడాల్సిందే. -
పేదల ‘దీపం’కు మోక్షం !
తొలి విడతకు ఐదు వేల కనెక్షన్లు కొనసాగుతున్న లబ్ధిదారులు ఎంపిక డిసెంబర్‌లోగా కనెక్షన్ల పంపిణీ పూర్తిడ సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని పేదింటి మహిళలకు ‘దీపం’ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. తొలి విడతగా నియోజకవర్గానికో ఐదు వేల దీపం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జీహెచ్ఎసీ పౌరసరఫరాల శాఖ అధికారులు లబ్ధిదారులకు ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తిచేసి ఈ ఏడాది చివరి నాటికి అర్హులకు కనెక్షన్లు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టారు. అర్హులైన నిరుపేద మహిళలకు దీపం పథకం కింద కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనే మార్గదర్శకాలు విడుదల చేసింది. రాజకీయ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో మార్గదర్శకాల్లో కొద్దిపాటి మార్పులు చేసి ఇన్చార్జి మంత్రులకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను కట్టబెడుతూ సరిగ్గా రెండు మాసాల క్రితం మరో ఉత్తర్వు ఇచ్చింది. అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలతో పాటు అర్బన్ ఐకేపీ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ కార్యాలయం (సీఆర్వో), రంగారెడ్డి పౌరసరఫరాల శాఖ కేవలం కనెక్షన్ల మంజూరు, గ్యాస్ ఏజెన్సీల ఎంపిక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి సర్కిల్లోనూ స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో వార్డు కమిటీ సమావేశాల్లో లబ్ధిదారులను ఎంపిక నిర్వహించాలి, కానీ ప్రస్తుతం కార్పొరేటర్లు మాజీలయ్యారు. దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యే సమక్షంలో డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికను పౌర సరఫరాల అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉచితంగా కనెక్షన్లు జీహెచ్ఎంసీ పరిధిలోని నిరుపేద కుటుంబాల్లో దీపం పథకం కనెక్షన్లు వెలుగు నింపనున్నాయి. వాస్తవంగా పథకం కింద ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ రూ.1600 లను ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికే మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కనెక్షన్లకు సంబంధించి నిధులను సైతం విడుదల చేసింది. సిలిండర్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ రూ.1450, కాగా, రెగ్యులేటర్ కోసం రూ.150లు. దీపం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు జారీ చేసి ఖాళీ సిలిండర్, రెగ్యులేటర్ అందజేస్తారు. లబ్ధిదారులు కనెక్షన్ డాక్యుమెంట్, పాస్‌బుక్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఐఎస్ఐ మార్క్ గల గ్యాస్ స్టౌవ్, పైపు, గ్యాస్(నిండిన) మాత్రమే కోనుగోలు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు దీపం కనెక్షన్‌తో పాటు డీలరు వద్ద తప్పనిసరిగా గ్యాస్ స్టౌవ్‌ను కొనుగోలు చేయాల్సి అవసరం లేదు. చమురు సంస్థలు కూడా కనెక్షన్లకు సిద్ధమయ్యాయి. -
జన్మభూమి క మిటీల పెత్తనాన్ని అడ్డుకోండి
జగన్‌కు ప్రజాప్రతినిధుల వినతి నక్కపల్లి: ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువగా ఉంటోందని, దీన్ని అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్‌లు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. గోకులపాడు మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న జగన్మోహన్రెడ్డికి నక్కపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జాతీయరహదారిపై వందలాది మంది కార్యకర్తలు,నాయకులు, మహిళలు ఉండడంతో ఆయన వాహనం దిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా ఉన్న తెలుగు తమ్ముళ్ల పెత్తనం గురించి వీసం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావులు వివరించారు. లబ్ధిదారుల ఎంపికలో పచ్చపాతం చూపిస్తున్నారని వాపోయారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు విలువలేకుండా పోతోందని వివరించారు. పార్టీతరపున కోర్టును ఆశ్రయించి టీడీపీవారి ఆగడాలకు అడ్డుకట్టవేయాలని కోరారు. రుణాలు మాపీ వర్తించలేదని పలువురు డ్వాకామహిళలు జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయారు. పొదుపు సొమ్మును వడ్డీలకు జమచేసుకుంటున్నారని, చంద్రబాబు మోసం చేశాడన్నారు. ఇందుకు జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ దీనిపై పార్టీ తరపున రాజీలేనిపోరాటం చేస్తున్నామన్నారు. జన్మభూమి కమిటీల విషయం పార్టీలో చర్చించి తగునిర్ణయం తీసుకుంటామన్నారు. జగన్‌ను కలిసిన వారిలో పార్టీనాయకులు మణిరాజు, పొడగట్లపాపారావు, జోగారావు, లొడగలచంద్రరావు, శేషారత్నం, ఎరిపల్లిశ్రీను, వెలగా ఈశ్వరరావు, గొర్లి నర్సింహమూర్తి, తిరుపతిరావు, మూలపర గోవిందు, గోసల కాసులమ్మ, కోమర్తి బాబూరావు, ముసలయ్య, వీసంరాజు ఉన్నారు. -
పెన్షన్.. టెన్షన్!
జోగిపేట: జిల్లాలో ఇప్పటి వరకు సుమారు ఐదు వేల పింఛన్ల పంపిణీ జరిగినట్లు సమాచారం. అయితే పింఛన్లకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. పింఛన్ల కోసం దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా రావడం, మార్గదర్శకాల్లో స్పష్టత లేకపోవడంతో అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో పాటు పాటు వివిధ కేటగిరీల కింద పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 6,7 తేదీల్లో అర్హుల జాబితాను ఎంపిక చేసి పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులు ప్రకటించారు. అయితే జాబితా సిద్ధం కాకపోవడంతో ఆ ఆదేశాలను చాలా వరకు సిబ్బంది పాటించలేదనే విమర్శలున్నాయి. దీంతో దరఖాస్తు చేసుకున్న వారు, గతంలో పెన్షన్లు పొందిన వారు మాత్రం తమకు పెన్షన్ వస్తుందో..రాదోననే ఆందోళనతో ఉన్నారు. జిల్లాలో సుమారుగా 2.40 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్ల పంపిణీ చే సేందుకు ఎంపిక చేశారని అధికార వర్గాలు తెలిపాయి. అందోలు మండలంలో నగర పంచాయతీ మినహా మిగతా గ్రామాల్లో 6,914 దరఖాస్తులు రాగా, 4374 పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. జోగిపేట-అందోలు నగర పంచాయతీ పెన్షన్ల విషయంలో కొంత అయోమయం నెలకొంది. పట్టణంలో పెన్షన్ దారులు, దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1,500 ఇస్తుండడంతో లబ్ధిదారులు కొత్త పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 8న అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ చేతుల మీదుగా సుమారు 600 మందికి పెన్షన్లను పంపిణీ చేశారు. అయితే చాలా మంది పేర్లు జాబితాలో కనిపించకపోవడం...వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో గ్రామాల్లో పంపిణీ చేస్తామని చెబుతున్నా, అది సాధ్యం కాదంటున్నారు. ప్రొసీడింగ్‌లను సిద్ధం చేసి కార్డులను సిద్ధం చేసి, జాబితాను ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. -
పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం
* తొలి దశలో 12 వేల మందికి.. * మూడు రంగుల్లో కార్డులు * నియోజకవర్గ కేంద్రాలకు ప్రాధాన్యం * ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పంపిణీ * మిగిలిపోయిన కుటుంబాల సమగ్ర సర్వే కొనసాగింపు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారయంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 8 నుంచి 12 వేలమందికి పింఛన్లు ఇవ్వడానికి నిర్ణయించారు. పంపిణీలో నియోజకవర్గ కేంద్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నగరానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి పద్మారావు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపిన అనంతరం అధికారులు పంపిణీ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సమగ్ర సర్వే అనుసంధానంతో ఎంపికైన కొత్త లబ్ధిదారులకు అక్టోబర్ నుంచి పెంచిన వాటిని కలుపుకుని... వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ. 1500 చొప్పున పంపిణీ చేస్తారు. జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 500 చొప్పున 8 వేలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్లో 4 వేల మందికి పింఛన్లు పంపిణీ చే సే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు అందాయి. మరోపక్క సామాజిక పింఛన్ల దరఖాస్తుల వెరిఫికే షన్ కార్యక్రమాన్ని ఈ నెల 15 వరకు కొనసాగిస్తూనే..పంపిణీ ప్రక్రియ దశలవారీగా కొనసాగేటట్టు అధికారులు తగిన ప్రణాళిక రూపొందించారు. మూడు రకాల కార్డులు.. పింఛన్ లబ్ధిదారుల కోసం మూడు రకాల కార్డులను ముద్రించారు. వృద్ధుల కోసం ‘ఆసరా’ పేరుతో పింక్ కార్డులు, వితంతువుల కోసం బ్లూ కార్డులు, వికలాంగుల కోసం గ్రీన్ కార్డులను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముద్రించారు. వీటిని పంపిణీ సమయంలో ఆయా లబ్ధిదారులకు అందచేస్తారు. వెరిఫికేషన్ 85 శాతం పూర్తి సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో 1,35,429 దరఖాస్తులు రాగా, రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్ పరిధిలో1,10,292 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు నగరంలో దరఖాస్తుల పరిశీలన 85 శాతం వరకు పూర్తయిందని, మిగతావి ఈ నెల 15 వరకు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన కుటుంబాల సర్వే షురూ.. నగరంలో గతంలో సర్వే చేయని కుటుంబాల కోసం మరోసారి సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నారు. నగరంలో దాదాపు 1.60 లక్షల కుటుంబాలు గతంలో నిర్వహించిన సర్వే పరిధిలోనికి రాలేదని భావిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 53 వేల కుటుంబాలు.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్లో 1.07 లక్షల కుటుంబాల సర్వే పూర్తి కాలేదని అధికారులు అంచనా వేశారు. ఈమేరకు హైదరాబాద్ జిల్లా పరిధిలో 1400 మంది ఉపాధ్యాయులు సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఇది పూర్తికావచ్చని భావిస్తున్నారు. ‘నిబంధనల’ టెన్షన్ నిబంధనలు, కొత్త మార్గదర్శకాల కారణంగా గ్రేటర్ పరిధిలో భారీస్థాయిలో పింఛన్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా జనాభాలో 60 శాతానికి మించి పింఛన్లు మంజూరు చేయకూడదని పేర్కొంటూనే....కేటగిరీల వారిగా వద్ధాప్య పింఛన్లు 7 శాతం, వితంతు 5, వికలాంగులవి 3 శాతం మాతమే ఉండాలని ఇటీవలి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌శర్మ సూచించటం పెన్షన్‌దారులను టెన్షన్‌కు గురిచేస్తోంది. కాగా గ్రేటర్ పరిధిలో 2.45 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన నేపథ్యంలో 1.43 లక్షలకు మించి లబ్ధిదారుల ఎంపిక ఉండక పోవచ్చునని తెలుస్తుంది. ఈ లెక్కన 60 శాతం నుంచి 63 శాతానికి మించి లబ్ధిదారుల ఎంపిక ఉండటం లేదని తెలుస్తున్నది. -
పక్కాగా లబ్ధిదారుల ఎంపిక
నారాయణపేట : తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హత గల వారికి అందించే బాధ్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు చోటిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో నారాయణపేట ఆర్డీఓ స్వర్ణలత అధ్యక్షతన డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల మండల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల దరఖాస్తులను గ్రామస్థాయిలో వీఆర్వోలు, పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది స్వీకరించాలని, రిజిస్టర్లో నమోదు చేయాలని చెప్పారు. ఈనెల 15వరకు దరఖాస్తులు స్వీకరించి, 16న జరిగే విచారణలో ఏఏ అంశాలకు సంబందించి పరిగణలోకి తీసుకుని నిర్ధారించాలనే విషయంపై అవగాహన కల్పించారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆధారంగా చేసుకుని దరఖాస్తుల స్వీకరణ సక్రమంగా ఉండేలా చూడాలని చెప్పారు. ఒకే కుటుంబంలో నివసిస్తూ ఆహారభద్రత కార్డుల కోసం వేర్వేరుగా అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆహార భద్రతకార్డులు పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి లక్షా 50వేలు, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు అని తెలిపారు. రెండున్నర ఎకరాల తరి, 5ఎకరాల మెట్టభూమి ఉన్న వారికి ఆహార భద్రతకార్డులు ఇవ్వకూడదని చెప్పారు. ఈ విషయంలో విచారణ సర్వే బృందం నేరుగా ఇంట్లోకి వెళ్లి ఇంటి స్థితిగతులు, ఆదాయ మార్గా లు, గ్యాస్ కనెక్షన్, వాహనాలు, వ్యాపారం వంటి వాటిని నిశితం గా పరిశీలించాలని ఆదేశించారు. వంట గది మినహాయించి 3గదుల ఆర్సీసీ స్లాబ్‌తో కూడిన ఇల్లు ఉండే కూడా అనర్హులుగా గుర్తించి నమోదు చేసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఇతర వ్యక్తుల ఒత్తిళ్లకు లొంగవద్దని ఆదేశించారు. ఒకవేళ పొరపాటు చేస్తే సంబంధిత అధికారి బాధ్యత వహించా ల్సి ఉంటుందని చెప్పారు. వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం జత చేసేలా చూడాలని సూచించారు. ఇప్పుడున్న రేషన్‌కార్డులు, అన్నిరకాల పింఛన్లు వచ్చేనెల నుంచి అమలు కాబోవని స్పష్టం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని చెప్పారు. ఆర్డీఓ స్వర్ణలత మాట్లాడుతూ దారిధ్య్ర రేఖకు దిగువన ఉన్న వారికే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. గత కుటుంబ సమగ్ర సర్వేతో పాటు నేటి విచారణను జోడించి అర్హులను గుర్తించాలని చెప్పారు.