
దప్పికైతే ఎక్కిళ్లే
వణికించే చలికాలంలోనూ నీటి కష్టాలు తప్పడం లేదు. వర్షాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా నీటి సమస్య నెలకొంది. పలు ప్రాంతాల్లో బోర్లు పనిచేయడం లేదు.
=పనిచేయని రక్షిత మంచినీటి పథకాలు
=పీలేరు, కుప్పం నియోజకవర్గాల్లో తీవ్ర నీటి ఎద్దడి
=బిందె నీళ్లు రూ.4
=మూడు నుంచి వారం రోజులకోసారి నీటి సరఫరా
వణికించే చలికాలంలోనూ నీటి కష్టాలు తప్పడం లేదు. వర్షాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా నీటి సమస్య నెలకొంది. పలు ప్రాంతాల్లో బోర్లు పనిచేయడం లేదు. జనం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. పీలేరు, కుప్పం నియోజకవర్గాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో ప్రజలు బిందె నీటిని నాలుగు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంలో కూడా ఇదే పరిస్థితి. ముఖ్య పట్టణాల్లో మూడు నుంచి వారం రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు.
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని 1,365 పంచాయతీల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాల్లో 30 శాతానికి పైగా పనిచేయడం లేదు. కొన్నిచోట్ల బోర్లలో భూగర్భజలాలు అడుగంటాయి. ఇంకొన్నిచోట్ల మోటార్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు పట్టణంలో బిందె నీటిని రూ.4 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జనం నీటి కోసం 4, 5 కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వందలకుపైగా గ్రామాల్లో ట్యాంకర్ నీళ్లే ఆధారమవుతున్నాయి. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లలో రోజు మార్చి రోజు, రెండు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది. మదనపల్లె పట్టణంలో మూడురోజులకోసారి, శివారు ప్రాంతాల్లో వారానికోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో కలుషితమైన నీరు సరఫరా అవుతోంది.
కుప్పం నియోజకవర్గం 89 పంచాయతీల పరిధిలోని 170 గ్రామాల్లో తాగునీటి కొరత నెలకొంది. జనం వ్యసాయబోర్లను ఆశ్రయిస్తున్నారు. వీటిల్లోనూ భూగర్భజలాలు అడుగంటాయి. వెయ్యి అడుగులు బోరు వేస్తేగానీ నీళ్లు పడడం లేదు. పలు ప్రాంతాల్లో డబ్బులు పెట్టి నీటిని ట్యాంకర్లతో తోలించుకుంటున్నారు. గత నెలలో చంద్రబాబు పర్యటించిన వెళ్లిన తర్వాత కూడా నీటి సమస్య పరిష్కారం కాలేదు.
పీలేరు నియోజకవర్గంలోని పీలేరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీరు బిందె రూ.4 చొప్పున జనం కొం టున్నారు. పట్టణం మొత్తం ట్యాంకర్లపైనే ఆధారపడి నీటి సరఫరా జరుగుతోంది.
పలమనేరు నియోజకవర్గంలోని 614 రక్షిత మంచినీటి స్కీం బోర్లలో 110 పని చేయడం లేదు. మొత్తం 1,250 హ్యాండ్‌బోర్లలో 710 పనిచేయడం లేదు. అలాగే 18 వేల వ్యవసాయ బోర్లలో 1000 ఎండిపోయాయి. పల మనేరు మున్సిపాలిటీలో రోజుకు 5.11 మి లియన్ లీటర్లు అవసరం. అయితే 2.5 మిలియన్‌లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. మూడురోజులకోసారి నీళ్లు వదులుతున్నారు.
తంబళ్లపల్లె మండలంలోని ఎర్రివారిపల్లె, అనిగానిపల్లె తదితర గ్రామాల్లో 6 నెలలుగా మంచినీటి ఎద్దడి నెలకొని ఉంది. భూగర్భ జలాలు అడుగంటాయి. మోటార్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా పీటీఎం మండలంలో తాగునీటి ఎద్దడి ఉం ది. కొత్త బోర్లకు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. మిగిలిన మండలాల్లో నీళ్లు ఉన్నాయి. అయితే మోటార్లు బిగించడంలో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్‌శాఖల అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు.
మదనపల్లె పట్టణంలో మూడు నుంచి నాలుగురోజులకోసారి నీళ్లు వదులుతున్నారు. ప ట్టణ శివారు ప్రాంతాల్లో వారానికి ఓ మా రు నీళ్లు ఇస్తున్నారు. ఎక్కువ మందికి వ్యవసాయబోర్లే ఆధారమవుతున్నాయి. మరికొన్ని చోట్ల ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు.
శ్రీకాళహస్తిలో ఇసుక అక్రమ రవాణా వల్ల స్వర్ణముఖి నదిలో బావులు పూడిపోయా యి. పట్టణంలోని తుపాన్ సెంటర్, కుందేటివారి వీధి, చెంచులక్ష్మికాలనీ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. బోర్లకు మరమ్మతులు చేయకుండా వదిలేశారు. ని యోజకవర్గంలోని 30 శాతం పంచాయతీల్లో నీటి సమస్య రాజ్యమేలుతోంది.
తిరుపతి నగరంలో రోజు మార్చి రోజు నీళ్లు వదులుతున్నారు. కొర్లగుంట ప్రాంతంలో పైపులు దెబ్బతిన్నాయని మూడురోజులుగా నీళ్లు సరిగా వదలడం లేదు. మొదటి అర్ధగంట కలుషిత నీరు వస్తోంది. దాసరి మఠం, ఎస్టీవీనగర్, బైరాగిపట్టెడ ప్రాం తాల్లో కలుషిత నీరు సరఫరా అవుతోంది. నీటి విడుదలలో సమయపాలన పాటిం చడం లేదు. రోజుకు 41 మిలియన్ల లీటర్ల నీళ్లు అవసరం. అయితే 30 మిలియన్ లీ టర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి.
సత్యవేడు నియోజకవర్గంలోని చెరువుల్లో నీటి నిల్వలు అంతంతమాత్రంగానే ఉన్నా యి. తెలుగుగంగ దిగువనున్న ఐదారు చెరువుల్లో మాత్రం జలకళ ఉంది. పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య నెలకొంది.
పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని 15 గ్రామాల్లో బోర్లు వేిసినా నీళ్లు పడలేదు. దీంతో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే 184 గొల్లపల్లె పంచాయతీ పేరకూరు, మాధవరం పంచాయతీ కూడిగుట్ట ఎస్సీ కాలనీ, కోటివారిపల్లె పంచాయతీ కొత్తూరు గ్రామాల్లో ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.