
చర్చకు సిద్ధంగా ఉన్నాం : యనమల
హైదరాబాద్ : రాజకీయ హత్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం దద్దరిల్లింది. రాజకీయ హత్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 2004 నుంచి జరిగిన రాజకీయ హత్యలపై చర్చిద్దామని ఆయన మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు.
అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు పరిటాల రవి అంశాన్ని లేవనెత్తారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టిన తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించటంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు.