ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాము పనిచేయలేమని తెలంగాణ సచివాలయ నాలుగో తరగతి ఉద్యోగులు కమలనాథన్ కమిటీకి తేల్చిచెప్పారు.
కమల నాథన్ కమిటీకి టి.ఉద్యోగుల వినతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాము పనిచేయలేమని తెలంగాణ సచివాలయ నాలుగో తరగతి ఉద్యోగులు కమలనాథన్ కమిటీకి తేల్చిచెప్పారు. తెలంగాణకు చెందిన తమను ఇక్కడి ప్రభుత్వంలోనే పనిచేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్స్ మినహా నాలుగో తరగతి ఉద్యోగులకు ఆప్షన్లకు అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నాగరాజు ఆధ్వర్యంలో నాలుగో తరగతి ఉద్యోగులు శనివారం నోటికి నల్లగుడ్డలు ధరించి సీ బ్లాక్ వద్ద నిరసన తెలిపారు.
నంతరం కమలనాథన్ కమిటీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు చెందిన సుమారు 625 మంది నాలుగో తరగతి ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని, ఈ విషయంలో కనీసం తమ వాదన చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. తక్షణమే తమ వినతిని పరిశీలించాలని వారు కమలనాథన్ కమిటీని కోరారు.