పిల్లల కడుపు కొట్టొద్దు | we cannot beat on child stomach | Sakshi
Sakshi News home page

పిల్లల కడుపు కొట్టొద్దు

Published Sat, Aug 31 2013 3:52 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM

we cannot beat on child stomach

నారాయణపేట రూ రల్, న్యూస్‌లైన్: సం క్షేమ వసతి గృహాల్లో నిరుపేద విద్యార్థుల కు నాణ్యమైన భోజ నంతో పాటు విద్య ను అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా అధికారులు మాత్రం పిల్లల కడుపు కొడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ ఆరోపించారు. సైకిల్‌యాత్రలో భాగంగా శుక్రవారం పట్టణంలోని వివిధ వసతి గృహాలను సందర్శించారు.
 
 ఈ సందర్భంగా మాట్లాడుతూ పేరుకే సంక్షేమ హా స్టళ్లు ఉన్నాయని వాటిలో విద్యార్థుల కు మెనూ ప్రకారం నాణ్యమైన భోజ నం, మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. వసతి గృహాల్లో కలెక్టర్ తో పాటు అధికారులు బస చేయడ మే తప్పా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని వాపోయారు. రాత్రివేళ విద్యార్థులు దోమలతో రో గాల బారినపడుతున్నారన్నారు. హా స్టల్ విద్యార్థులకు మెస్‌చార్జీలను జనరల్ వసతి గృహాల్లో రూ.1,500, కళాశాల వసతి గృహాల్లో రూ. 2,500కు పెంచాలని డిమాండ్ చేశారు. సొంత భవనాలు నిర్మించాలని, మరుగుదొ డ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.
 
 మధ్యాహ్న భోజన పథకా న్ని పడక్బందీగా అమలు చేయాల న్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, పెరి గిన ధరలకు అనుగుణంగా ఉపకార వేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్ పెంచాలన్నారు. సెప్టెంబర్ 3న కలెక్టరేట్ ముట్టడించనున్నామని, దీనికి ఎమ్మెల్సీ నాగేశ్వర్ హాజరవుతార న్నా రు. జిల్లావ్యాప్తంగా చేపట్టిన సైకిల్‌యాత్రలో తమ దృష్టికి వచ్చిన హా స్టల్ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీ సుకెళతామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భీంషప్ప, రవి తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement