Drinking Water Facility
-
శతమానం భారతి: జల సంరక్షణ
‘ఆహార భద్రత’ అనే మాటలా తాగునీటి భద్రత అనే మాట ప్రాచు ర్యంలో లేకపోవచ్చు. కానీ అందరికీ ఆహారం, ఆరోగ్యం అన్నట్లే.. అందరికీ తాగునీరు అవసరం. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చాక వేసుకున్న పంచవర్ష ప్రణాళికల్లో సురక్షిత తాగునీటికి తగిన ప్రాధాన్యమే లభించింది. 1949 భోర్ కమిటీ సూచనల ప్రకారమైతే మన పాలకులు 1990 నాటికి దేశంలోని జనాభా మొత్తానికీ సురక్షిత తాగునీటిని అందించాలి. ఆ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేకున్నా.. లక్ష్య శుద్ధితో మాత్రం ప్రభుత్వాలు పని చేశాయి. భోర్ కమిటీ సూచన పాటింపులో భాగంగా 1969లో యునిసెఫ్ సాంకేతిక సహాయంతో నాటి ప్రభుత్వం జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించింది. తర్వాత మూడేళ్లకు 1972లో సత్వర గ్రామీణ నీటి సరఫరా పథకం మొదలైంది. నీటి కొరత ఉన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ పథకాన్ని అమలు చేశారు. ఆ వరుసలోనే 1987లో తొలి జాతీయ నీటి విధానానికి రూపకల్పన జరిగింది. 1991లో రాజీవ్‌గాంధీ జాతీయ తాగునీటి మిషన్ ఆరంభమైంది. 2002లో పౌర భాగస్వామ్యం ప్రాతిపదికన ‘స్వజలధార’ పథకం ప్రారంభం కాగా, 2005లో ‘భారత్ నిర్మాణ్’ కార్యక్రమం నీటి సరఫరా లేని ప్రాంతాలకు ఐదేళ్లలో తాగునీటి అందించాలని సంకల్పించుకుంది. ఏ ప్రణాళిక అయినా పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వడం అనేది ప్రభుత్వం పైనే కాక, ప్రజల పైనా ఆధారపడి ఉంటుంది. నీరు అనే అమృతాన్ని భావి తరాలకు భద్రపరిచి మిగిల్చాలన్న ప్రతినను ఈ అమృతోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. (చదవండి: జైహింద్ స్పెషల్: వాంటెడ్ సూర్యసేన్) -
ఫ్లోరైడ్ తగ్గింది.. నీటి నాణ్యత పెరిగింది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించే బోరు బావుల్లో నీటి నాణ్యత గతం కంటే బాగా మెరుగుపడినట్టు తేలింది. ప్రత్యేకించి గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కోసం వినియోగించే వివిధ రకాల నీటి వనరులకు అధికారులు పరీక్షలు నిర్వహించగా.. ఫ్లోరైడ్ తదితర కాలుష్య కారకాలు అతి తక్కువ చోట్ల ఉన్నట్టు స్పష్టమైంది. తాగునీటి అవసరాలకు ఉపయోగించే వనరులలోని నీటికి గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఒకసారి, ఆరు నెలల తర్వాత మరోసారి తప్పనిసరిగా నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆరున్నర నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ చోట్ల మొత్తం 1,80,608 నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేయించారు. వాటిలో 6,432 నీటి నమూనాల్లో ఫ్లోరైడ్ లేదా ఇతర ప్రమాదకర కాలుష్యాలు ఉన్నట్టు తేలింది. అంటే మొత్తం పరీక్షలలో కేవలం 3.5 శాతం నీటి నమూనాలలోనే కాలుష్య కారకాలను గుర్తించారు. గతంలో వివిధ సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సేకరించిన నీటి నమూనాల్లో 15 శాతానికి పైగా ఫ్లోరైడ్ వంటి కారకాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు నిర్ధారణ అయిన సందర్భాలు ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,432 చోట్ల కాలుష్య కారకాలను గుర్తించగా.. వాటిలో 6,396 చోట్ల వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు కూడా పూర్తి చేసినట్టు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు వెల్లడించారు. గత రెండేళ్లగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టాలు పెరగడం, సురక్షిత తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యల వల్ల రాష్ట్రంలో కలుషిత నీటి జాడలు బాగా తగ్గినట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్పారు. పరీక్షల్లో మన రాష్ట్రమే టాప్ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ముందే నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 1,99,785 నీటి నమూనాలు సేకరించి, వాటిలో 1,80,608 నమూనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. దేశంలో మరే రాష్ట్రం లక్షన్నర నీటి నమూనాలకు మించి పరీక్షలు నిర్వహించలేదు. ఏపీ తర్వాత మధ్యప్రదేశ్ 1.49 లక్షల నీటి నమూనాలను సేకరించి, అందులో 1.26 లక్షల నమూనాలకు పరీక్షలు నిర్వహించి రెండో స్థానంలో ఉంది. -
ఇక చెత్త కనిపించదు: మోదీ
న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్–అర్బన్, అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సఫర్మేషన్ (అమృత్) పథకాల రెండో దశను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల ప్రజలకు చెత్త నుంచి విముక్తి కలిగించడంతో పాటు, తాగునీటి భద్రత కల్పించడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ దశలో మురుగునీటిని శుద్ధి చేయకుండా నదుల్లోకి వదలమని చెప్పారు. అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఎస్బీఎం 2.0, అమృత్ 2.0ను ప్రారంభించిన ప్రధాని అంబేడ్కర్ కలలు సాకారం అవడానికి కూడా ఈ పథకాల ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు.సమాజంలో అసమానతలు తొలగించడానికి పట్టణాభివృద్ధి కూడా కీలకపాత్ర పోషిస్తుందని దాదాసాహెబ్ భావించేవారని, అలాంటి చోట ఈ కార్యక్రమం జరగడం హర్షించదగిన విషయమని అన్నారు. మెరుగైన జీవితం కోసం ఎన్నో కలలతో గ్రామాల నుంచి పట్టణాలకు వస్తారని, వారికి ఉద్యోగాలు వచ్చినప్పటికీ జీవన ప్రమాణాలు దక్కడం లేదని అన్నారు. ఇళ్లకి దూరంగా వచ్చిన వారు ఇలాంటి పరిస్థితుల్లో నివసించడం చాలా దారుణమైన విషయమని అందుకే పట్టణాల్లో పరిస్థితులు మారాలని అన్నారు. రోజుకి లక్ష టన్నుల వ్యర్థాలు: దేశంలో ప్రతీ రోజూ లక్ష టన్నుల చెత్త వస్తోందని, పట్టణాల్లో ఎక్కడికక్కడ కొండల్లా పేరుకుపోతున్న ఈ చెత్తను తొలగించడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. 2014లో స్వచ్ఛభారత్‌ని బహిరంగ మల విసర్జనకి వ్యతిరేకంగా చేపట్టామని ఆ దశలో 10 కోట్లకు పైగా టాయిలెట్లు నిర్మించామని చెప్పారు. ఈ సారి పట్టణాల్లో చెత్త నుంచి ప్రజల్ని విముక్తి చేయడమే లక్ష్యమని ప్రధాని చెప్పారు. అమృత్‌లో భాగంగా మురుగునీరు నదుల్లోకి కలవకుండా చూస్తామని, పట్టణ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందిస్తామని ప్రధాని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత ప్రచారాన్ని యువతరం అందిపుచ్చుకుందని మోదీ చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ చిత్తు కాగితాలు విసిరివేయొద్దని, జేబులో ఉంచుకొని తర్వాత చెత్త బుట్టలో వెయ్యాలన్నారు. చిన్న చిన్న పిల్లలే రోడ్లపై ఉమ్మి వేయొద్దని పెద్దలకి చెబుతున్నారని అన్నారు. ఇదేదో ఒక్క రోజో, ఒక ఏడాదో చేసే కార్యక్రమం కాదని, ప్రతీ రోజూ చేయాలని, ఒక తరం నుంచి మరో తరానికి స్వచ్ఛభారత్ ప్రయాణం కొనసాగించాలని అన్నారు. 70% చెత్త శుద్ధి చేస్తున్నాం 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమైనప్పుడు దేశంలో పేరుకుపోయే చెత్తలో 20 శాతం కంటే తక్కువ మాత్రమే శుద్ధి అయ్యేదని, ఇప్పుడు 70% చెత్తను శుద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. త్వరలోనే దానిని 100 శాతానికి తీసుకువెళతామని చెప్పారు. పట్టణాభివృద్ధి శాఖకి 2014లో 1.25 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే, ప్రస్తుతం రూ.4 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. అర్బన్ 2.0కి 1.41 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా వెల్లడించారు. ఆ మిషన్‌ని మూడు ఆర్లు (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) ద్వారా ముందుకు తీసుకువెళతామని ప్రధాని మోదీ వివరించారు. ఇక అమృత్‌లో భాగంగా భూగర్భ జల సంరక్షణకు చర్యలు చేపడతారు. అత్యంత ఆధునిక టెక్నాలజీని వినియోగిం చుకుంటూ మురుగు నీరు భూగర్భంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. -
తాగునీటి పరీక్షల్లో మనమే ముందు
సాక్షి, అమరావతి: తాగునీటి నాణ్యత పరీక్షల నిర్వహణలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే బోర్లు, ఇతర స్టోరేజీ ట్యాంకుల్లో నిల్వ ఉంచిన నీరు ఫ్లోరైడ్ వంటి ఇతర ప్రమాదకర కారకాలు లేకుండా సురక్షితమైనదేనా అని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నీటి వనరులో నమూనాకు ఏటా నాణ్యత పరీక్షలు చేస్తుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు చివరి వరకు (5 నెలల్లో) దేశం మొత్తంలో 8,78,667 నీటి నమూనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అందులో దాదాపు ఐదోవంతు అంటే 1,63,065 నమూనాల పరీక్షలు మన రాష్ట్రంలో నిర్వహించినవే. పలు పెద్ద రాష్ట్రాలతో సహా దేశంలోని మిగిలిన వాటిలో మరే రాష్ట్రంలోను లక్షకు మించి నీటి నాణ్యత పరీక్షలు జరగలేదు. కేంద్ర ప్రభుత్వమే ఈ వివరాలను తమ వెబ్ పోర్టల్‌లో తెలిపింది. రాష్ట్ర గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగం ఆధ్వర్యంలో మొత్తం 112 నీటినాణ్యత పరీక్ష కేంద్రాలున్నాయి. రాష్ట్రస్థాయిలో ఒకటి, ప్రతి జిల్లా కేంద్రంలోను, డివిజన్ కేంద్రంలోను ఒకటి వంతున ఈ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటివనరుల నుంచి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటివరకు 1,81,518 నీటి నమూనాలను సేకరించగా, వాటిలో 1,63,065 నమూనాల నాణ్యత పరీక్షలు పూర్తిచేసి ఎటువంటి కలుషిత కారకాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఆ వనరుల్లో నీటిని తాగునీటిగా ఉపయోగించుకోవడానికి అనుమతించినట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 12 ల్యాబ్‌లకు కొత్తగా నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ సర్టిఫికెట్ పొందినట్టు చెప్పారు. -
లాక్డౌన్ పొడిగింపు; ‘తగిన చర్యలు తీసుకుంటాం’
సాక్షి, విజయనగరం : విజయనగరంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకొని ప్రతిరోజూ నీరు ఇచ్చే విధంగా తోటపల్లికి నీరు తీసుకువస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసానిచ్చారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కమినర్‌లతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తామని తెలిపారు. ప్రతి మూడు రోజులకొకసారి ఐవీఆర్ఎస్ ద్వారా కొన్ని ప్రమాణాలపై అభిప్రాయం సేకరణ చేస్తుంటామని పేర్కొన్నారు. ఫిబ్రవరిలోనే తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు చేపట్టామని తెలిపారు. ప్రతిరోజూ కరోనా నియంత్రణ చర్యలు, ప్రజల సంక్షేమం, రైతు సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. (అందుకే ఆసుపత్రిలో ‘రిషి’ని చూడలేదు: అమితాబ్ ) విజయనగరంలో కరోనా పాజిటివ్ నమోదు లేకుండా యంత్రాంగం కృషి చేస్తోందని ప్రశంసించారు. గుజరాత్ నుంచి వచ్చే మత్స్యకారులను ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి 60 మంది విద్యార్థులు నడుచుకొని వస్తున్న విషయాన్ని తెలుసుకొని వారిని మూడు బస్సుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తీసుకు వస్తున్నామని వెల్లడించారు. ఎవరు ఎక్కడ ఉన్నారని తెలిస్తే వారిని క్షేమంగా వారి ఇళ్లకు తీసుకు వస్తామని పేర్కొన్నారు. వలస దారుల గురించి ఏ విధమైన సమాచారం అందినా వారిని తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. రెండు వారాలు లాక్డౌన్ పొడిగించినట్టు సమాచారం వచ్చిందని,. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. (ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్లు ఇవే ) -
మిషన్ భగీరథ క్షేత్ర పర్యటనకు కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు క్షేత్ర స్థాయి పరిశీలనకు కేంద్ర బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. దేశంలోని తాగునీటి సరఫరా పథకాల పనితీరు, తీరుతెన్నులను పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగంలోని అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు డి.రాజశేఖర్ నేతృత్వంలో అధికారుల బృందం మూడు రోజుల పాటు వివిధ జిల్లాల్లో పర్యటించనుంది. బుధవారం నాగర్‌కర్నూలు జిల్లాలోని ఎల్లూరు ఇంటెక్ వెల్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌తో పాటు భగీరథ నీరు సరాఫరా అవుతున్న గ్రామాలను పరిశీలించనుంది. గురువారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ కోమటిబండ, సిద్దిపేట గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమావేశం కానుంది. -
అడవితల్లికి పుత్ర శోకం
కొండలతో కలిసి.. కోనలతో మురిసి.. అడవి పూల వాసనతో పరిమళించి.. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచి.. అటవీ దేవతో ఒడిలో కునుకు తీసే గిరిజన బతుకులు నేటికీ ఏమాత్రం మారలేదు. నీటి కోసం.. కూటి కోసం.. వైద్యం కోసం.. రోడ్డు కోసం.. వెలుగు కోసం ఆశగా ఎదురు చూస్తేనే ఉన్నారు. విష జ్వరాలతో.. అంతుచిక్కని వ్యాధులతో మంచం పడుతూనే ఉన్నారు. ఈ శాపం నుంచి వారికి ఎప్పుడు విముక్తి లభిస్తుందో సమయమే తేల్చాలి. రాచర్ల(ప్రకాశం): మండల పరిధిలోని జేపీ చేరువు శివారుల్లో ఉన్న గిరిజనకాలనీ మౌలిక వసతులకు దూరంగా.. గిరజనుల అవస్థలకు దగ్గరగా మారింది. గిరిజనులకు అభివృద్ధి, కనీస సౌకర్యాల కోసం ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్లో సమర్పించిన అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. జేపీ చెరువు నల్లమల అటవీ ప్రాంత సమీపంలో అంబచెరువు వద్ద లోతు వాగు పక్కనే రెండు నెలల క్రితం ఫారెస్టు లాగింగ్ డీఎఫ్ఓ నాగేశ్వరరావు, తహసీల్దార్ ఎలిజబెత్‌రాణి 25 గిరిజనుల కుటుంబాలకు నివాసాలు ఏర్పాటు చేసుకోనేందుకు పాక్షికంగా స్థలాలను కేటాయించారు. దీంతో పూరి గుడిసెలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే కనీస సౌకర్యాలు లేకపోవడంతో గిరిజన కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాగునీటిని సరఫరా చేయకపోవడంతో కొండ ప్రాంతంలోని నీటి కుంటల్లోని నీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. ఈ నీటిని తాగడం వలన పెద్దలకు విషజర్వాలు, చిన్నారులకు చర్మవ్యాధులు సోకుతున్నాయి. కరెంటు లేకపోవడంతో రాత్రి సమయాల్లో కొండ ప్రాంతంలో నివసించే క్రూర మృగాలు, విషాసర్పలు తమ నివాసాల్లోకి వస్తున్నాయని భయాందోళనకు గురువుతున్నారు. నిలిచిన నీటి సరఫరా గడిచిన రెండు నెలలు 25 కుటుంబాల కలిగిన గిరిజనకాలనీకి రోజుకు ఒక ట్యాంకర్ చొప్పున తాగునీటిని సరఫరా చేసే వారు. అయితే సర్పంచుల పదవీకాలం ముగియడంతో పంచాయతీ ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. కానీ వారు ఇప్పటి వరకు గిరిజనకాలనీ వైపు కన్నెత్తి చూడలేదు. పైగా 10 రోజులుగా తాగునీటిని సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో గిరిజనులు వ్యవసాయ పొలాల్లో, కొండ ప్రాంతాల్లోని నీటి కుంటల్లో నిలిచిన వర్షపునీరు తాగుతున్నారు. దీనివల్ల దాదాపు 10 మందికి పైగా విషజ్వరాలు సోకి మంచాన పడ్డారు. గర్భిణులకు అందని వైద్యం.. లోతు వాగు పక్కనే నివాసం ఉంటున్న గిరిజనులకు వైద్యం అందడంలేదు. ముఖ్యంగా గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు వైద్యాధికారులు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. గర్భిణి అయిన చెంచు రమణమ్మకు పూర్తి స్థాయిలో వైద్యం అందకపోవడంతో మూడు రోజులుగా నొప్పులతో పూరి గుడిసెలోనే విలవిల్లాడుతోంది. కనీసం 108 వాహనం కూడా అటువైపు వెళ్లడంలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి మాకు ఇంత వరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు కల్పించలేదు. ఎన్టీఆర్ భరోసా అందడంలేదు. వీధిలైట్లు, కనీస సౌకర్యలు లేక అవస్థలు పడుతున్నాం. తాగునీటిని సరఫరా చేయకపోవడంతో కొండ ప్రాంతంలోని నీటి కుంటల్లో నీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నాం. ఈ నీటిని తాగడం వ్యాధులు వస్తున్నాయి. కరెంటు లేకపోవడంతో రాత్రి సమయాల్లో కొండ ప్రాంతంలో నివసించే ఎలుగుబంట్లు, పాములు తమ నివాసాల్లోకి వస్తున్నాయి. ఎన్నోసార్లు రెవెన్యూ అధికారుల అర్జీలు పెట్టుకున్నా ప్రయోజనం లేదు.– పాముల చెంచులక్ష్మి (గిరిజన మహిళ, జేపీ చెరువు) సమస్యలను పట్టించుకొనేవారే లేరు నేను పుట్టకతోనే వికలాంగురాలిని. రేషన్‌కార్డు, అధార్‌కార్డు, ఓటర్‌కార్డు ఉన్నాయి. వికాలాంగుల పింఛన్ కోసం జన్మభూమి–మాఊరు గ్రామసభల్లో ఎన్నో సార్లు అర్జీలను పెట్టుకున్నా. ఇంతవరకు విలాంగ పింఛన్ మంజూరు చేయలేదు. అంతేకాక యాటగిరి అల్లూరయ్య, యాటగిరి పోలయ్య, సవరం శ్రీను, యాటగిరి లక్ష్మీరంగయ్య, పాముల చెంచులక్ష్మి రేషన్‌కార్డు కోసం అర్జీలు పెట్టుకున్నా రేషన్‌కార్డులు కల్పించలేదు. మేము ఇచ్చిన అర్జీలు పక్కన పడేస్తున్నారు. -
'తెలంగాణలో 24గంటలపాటు మంచినీటి సరఫరా'
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాటు మంచినీటి సదుపాయాన్ని అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందుకోసం త్వరలో మంత్రులతో ఓ కేబినెట్ కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగించారు. దళితులు, గిరిజనులకు ఉచితంగానే మంచినీరు సరఫరా చేస్తామని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి సమాంతరంగా చేస్తామని చెప్పారు. ప్రజలతో మమేకమై ప్రజాప్రతినిధులు పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. -
ఆసరా అందించండి
సంగారెడ్డి అర్బన్: పింఛన్ల పంపిణీ కార్యక్రమం ‘ఆసరా’ను శనివారం అధికారికంగా ప్రారంభించాలని రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ స్థాయి ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా శుక్రవారం ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పింఛన్ల పంపిణీ నిర్వహించాలన్నారు. దీనిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక శాసన సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగేలా చూడాలని సూచించారు. పెన్షన్లు ఇచ్చేందుకు మండల పరిధిలోని గ్రామాల నుంచి తీసుకువచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలన్నారు. లబ్ధిదారులను క్షేమంగా తిరిగి వారి గ్రామాలకు చేరవేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం యథావిధిగా ఆయా గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు. పింఛన్లు అందజేసే చోట వైద్య శిబిరం మంచినీటి సౌకర్యం, తదితర మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో మెదక్ డివిజన్ నుంచి జేసీ డా.ఎ.శరత్ , డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జడ్పీ ఇన్చార్జ్ సీఈవో, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓలు మధుకర్‌రెడ్డి, వనజాదేవి, ముత్యంరెడ్డి, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
ఉప కేంద్రాలకు నిధులు
రూ.75 లక్షలతో తాగునీటి సౌకర్యం కలెక్టర్ ఆరోఖ్యరాజ్ పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలో ఆరో గ్య ఉపకేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పనకు రూ.75 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. గురువారం ఐటీడీఏ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఏజెన్సీలో పథకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తాగునీటి సౌకర్యం కోసం మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని జిల్లాపరిషత్ సీఈఓను ఆదేశించారు. ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు, జామిగుడ, రూడకోట గ్రామా ల్లో పర్యటించి తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఈఈని ఆదేశించారు. రూ.2.15 కోట్లతో ఏజెన్సీలో తాగునీటి సదుపాయాల కల్పనకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్ల తొలగింపు టెండర్లు పూర్తయి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్దేశిత సమాయానికి పనులు చేపట్టకపోతే వారిని తొలగించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలకు మంజూరైన వంట గదుల నిర్మాణం జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన పనులకు బిల్లులు సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ నెల 12లోగా ఉపాధి కూలీలు, పింఛనుదారుల ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలని ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీ చెల్లింపులు, పింఛన్ల చెల్లింపులు వేగవంతం చేయాలన్నారు. ఈసమావేశంలో ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్, ఆర్డీఓ జి.రాజుకుమారి, ఏపీఓ పీవీఎస్ నాయుడు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డ్వామా పీడి శ్రీరాములు నాయుడు, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈఈ కాంతినాథ్ పాల్గొన్నారు. -
మహా ఏర్పాట్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహాజాతరలో కోటి మంది భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఇప్పటికే 25లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పారు. మేడారం ఏర్పాట్లపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు రద్దీ ఎంత ఉన్నా ప్రతీ భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రోడ్లు వెడల్పు చేయడం వల్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీకి తగ్గట్లు విస్తరణ పనులు చేసినట్లు తెలిపారు. దర్శనం తర్వాత బయటకు వచ్చేందుకు రెండు దారులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. భక్తులకు అమ్మవార్ల ప్రసాదం అమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు బయటకు వచ్చే మార్గంలో ప్రసాదం అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక సిబ్బంది సుమారు 40 వరకు కౌంటర్ల ద్వారా ప్రసాదం అందిస్తారన్నారు. క్యూలైన్లలో నిలబడే భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. జాతరలో మంచి నీటిని పూర్తిస్థాయిలో క్లోరినేషన్ చేసి అందజేస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణం జాతరలో భక్తుల అవసరాలకు తగ్గట్లు టాయిటెట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వీటితోపాటు జనం ఎక్కువ సంఖ్యలో గుడారాలు ఏర్పరుచుకున్న చోట మొబైల్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పారిశుద్ధ్యం విషయంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. మద్యం అమ్మకాలపై నజర్ జాతరలో 22 మద్యం దుకాణాల ఏర్పాటుకు అ నుమతి ఇచ్చామన్నారు. మద్యం వ్యాపారులు అడ్డగోలుగా ధరలు పెంచకుండా, సిండికేట్ వ్యాపారంతో ఇబ్బందులు లేకుండా ఉండేం దుకు బృందాలు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే లెసైన్స్ రద్దు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం మేడారంలోని 60 పడకల ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నట్లు తెలి పారు. వైద్యాధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, 104 వాహనం సంచార వైద్య సేవలు అందిస్తుందన్నారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ కవర్లను పూర్తిస్థాయిలో నిషేధించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు ప్రత్యేక బృందాలుగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తారన్నారు. ఆటోలకు అనుమతి లేదు మేడారం వెళ్లే రహదారులు విస్తరించి ఉన్నందున వాహనాలు వేగంగా వచ్చే అవకాశం ఉం దని, అలాంటి సమయంలో ఆటోలతో ఇబ్బందులు ఎదురవుతాయని, దీంతో మంగళవారం నుంచి జాతర ముగిసే వరకు మేడారం వెళ్లేందుకు ఆటోలను అనుమతించమని వరంగల్ రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం కూ డా ఇబ్బందికరమేనని, ఈ విషయంలో వాహనదారులే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. జాతరకు సంబంధించి ప్రధానమైంది ట్రాపిక్ సమస్య అని, దానిని అదిగమించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ కోసం 24 స్థలాలు ఏర్పాటు చేశామని, అ డ్డంగా ఉన్న వాహనాలను తొలగించేందుకు నాలుగు క్రేన్లు, జేసీబీలు సిద్ధంగా ఉంచామన్నారు. డ్రైవర్లు మద్యం తాగొద్దు జాతరకు వాహనాలు తీసుకొచ్చే డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు న డపొద్దని అన్నారు. జంగాలపల్లి, పస్రాతోపాటు మరికొన్ని చోట్ల ప్రత్యేక పోలీసు గస్తీ బృందాలు బ్రీతింగ్ అనలైజర్స్తో పరీక్షలు చేస్తారని, డ్రైవర్లు తాగినట్లు గుర్తిస్తే వాహనం అక్కడే నిలిపివేస్తామని తెలిపారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసేవారికి నిద్రమత్తు తొలగించేందుకు పస్రాతోపాటు కొన్నిచోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఐస్‌లో తడిపిన కాటన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. చల్లని బట్టతో కళ్లు తుడుచుకోవడం వల్ల మరో 40 కిలోమీటర్ల వరకు నిద్రమత్తు రాకుండా ఉంటుందని అన్నారు. ఇది ఈసారి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
ఏదీ...‘మరుగు’
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు టాయ్లెట్లు నిర్మించాలని సాక్షాత్తూ సుప్రీమే ఆదేశించింది. అది ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల పట్టించుకోని ధోరణి విద్యార్థులకు అగచాట్లు తెస్తోంది. ప్రాథమిక సదుపాయాలు లేని స్కూళ్లలో ఎలా చదువుతామని కొందరు బడికే వెళ్లడం మానుకుంటున్నారు. ఉన్నవాటి నిర్వహణ లేక ఇబ్బం దులు పెరుగుతున్నాయి. మొత్తానికి ‘మరుగు’కు ఇక్కట్లు పడుతున్నారు. పాలమూరు, న్యూస్‌లైన్ : రేపటి పౌరులు ఆత్మగౌరవంతో ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. సర్కారు బడుల్లోని విద్యార్థినులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా.. వారి సౌకర్యం కోసం సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని 2012 అక్టోబరు నెలలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. విద్యాశాఖ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయని కారణంగా సర్కారు బడుల్లోని విద్యార్థులు ఆరుబయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితే నెలకొంటోంది. జిల్లాలో 3,955 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందుకుగాను పాఠశాలల నిర్వహణకోసం ఏటా రూ.3.95కోట్లు నిధులు మంజూరవుతున్నా.. వాటి ఫలితాలు ఎక్కడా కనబడటం లేదు. గతంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణపై దృష్టిసారించకపోవడంతో అవి ఉపయోగంలో లేకుండా పోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,559 పాఠశాలల్లోని విద్యార్థులు టాయ్లెట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. 2,948 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ప్రహరీగోడ నిర్మాణాల్లేవు. దీంతో ఆయా పాఠశాలలన్నీ అసాంఘీక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. 794 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంలేదు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా 600 అదనపు తరగతి గదులు అవసరం. ఈ సంఖ్య కేవలం విద్యాశాఖ లెక్కల ప్రకారం మాత్రమే.. వాస్తవానికి చూస్తే 75 శాతం వరకు పాఠశాలల్లో తగిన మౌళికవసతుల్లేక విద్యార్థినీ, విద్యార్థులు అవస్థపడుతున్నారు. సమన్వయలోపం ప్రభుత్వ శాఖల మధ్య ఏర్పడిన సమన్వయలోపం కారణంగా.. విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సర్కారు బడుల్లో టాయ్లెట్ల నిర్మాణాన్ని చేపట్టాల్సిన బాధ్యత ఆర్‌డబ్యుఎస్ శాఖదేనని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా.. వాటిని ఎప్పుడో నిర్మించాం, నిర్వహణ లోపం కారణమని వారు చెప్తున్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా నిర్మాణాలు చేపడుతున్న కొత్త భవనాల వద్ద వారే టాయ్లెట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల వాదన. వీటి నిర్మాణం కోసం రెండేళ్లుగా నిధులు మంజూరు కావడంలేదని ఆ శాఖ అధికారి పేర్కొన్నారు. ప్రాధమిక సదుపాయాలు కొరవడి ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపవుట్లూ పెరుగుతున్నాయి. రోడ్డు దాటాలంటే భయమే..! మా పాఠశాలలో అందరికి సరిపోయే మరుగుదొడ్లు లేవు. అందువల్ల విద్యార్థులందరం కలిసి హెవేను దాటి వెళ్తున్నాం. రోడ్డు దాటేటప్పుడు చాలా భయమేస్తోంది. అయినా తప్పడం లేదు. వెంటనే మూత్రశాలలు కట్టిస్తే రోడ్డు దాటే టెన్షన్ తగ్గుతుంది. -ఎం.లాలునాయక్, 9వ తరగతి, అడ్డాకుల ఆరుబయటకు వెళ్లాల్సిందే.. రోజు మూత్ర విసర్జనకు హైవేను దాటి వెళ్లాల్సి వస్తోంది. రోడ్డుపై లారీలు, కార్లు చాలా వేగంగా వస్తాయి. అందుకే అందరం కలిసి గుంపులు, గుంపులుగా రోడ్డు దాటుతాం. మా పాఠశాలలో బాలురందరు రోడ్డు దాటే వెళ్లాలి. బాలికలకు మాత్రమే సరిపోయే మరుగుదొడ్లు ఉన్నాయి. మా గురించి పట్టించుకునే వారు లేరు. -ప్రవీణ్‌కుమార్, 10 తరగతి, అడ్డాకుల ఆడ పిల్లలకు మరీ ఇబ్బంది. మా పాఠశాలలో మూత్రశాలలు లేవు. రోజు ఆరుబయటకే వెళ్తాం. వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటుంది. ఆడపిల్లలకు మరీ ఇబ్బందిగా ఉంటుంది. దీనిపై అధికారులు స్పందించాలి. పాఠశాల ఆవరణలోనే వాటిని ఏర్పాటు చేయాలి. -రాజశేఖర్, 9వ తరగతి, రాచాల -
రూ 9 కోట్లతో తాగునీటి సౌకర్యం
సీతంపేట, న్యూస్‌లైన్: ఐటీడీఏ పరిధిలోని వివిధ మం డలాల్లో రూ.9 కోట్లతో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె.సునీల్‌రాజ్‌కుమార్ తెలిపారు. ఐటీడీఏలో ఆర్డబ్ల్యూఎస్, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖల అధికారులతో బుధవారం సమావేశాన్ని నిర్వహించి, ఆయన మాట్లాడారు. గిరిజన గ్రామాలకు తాగునీటి వసతుల కల్పనకు రూ 4.5 కోట్లు, ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాల్లో తాగునీరు అందించేందుకు రూ 4.5 కోట్లు వెచ్చించనున్నామని చెప్పారు. ఎక్కడెక్కడ తాగునీటి సదుపాయం అవసరమో గుర్తించి, వీటీడీఏల ద్వారా పనులు చేపట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి నివారణకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. రక్షిత పథకాలు ఎక్కడెక్కడ పాడయ్యాయో..వెంటనే సర్వే చేయాలన్నారు. అవసరమైన చోట గ్రావిటేషన్ ఫ్లోలు నిర్మించాలని చెప్పారు. అలాగే ఐటీడీఏలో తాగునీటి సెల్ ఏర్పాటు చేయనున్నామని ఎక్కడ ఇబ్బంది ఎదురైనా.. 9573844577 నంబర్‌కు ఫోన్ చేయాలని గ్రామీణులకు సూచించారు. ఐఏపీలో రూ 23 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. వీటిలో రూ.30 లక్షలతో కెరీర్ గెడైన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అలాగే కొన్ని బీటీ రోడ్లు నిర్మించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గార రవణమ్మ, డీఈఈలు శాంతీశ్వరరావు, కుమార్, మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
మేడారం జాతరకు సన్నద్ధం కావాలి
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సన్నద్ధం కావాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి అధికారులకు సూచించారు. రీజియన్‌లోని డిపో మేనేజర్లతో శనివారం మేడారం జాతరపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్ఎం మాట్లాడుతూ జోన్‌లోని ఐదు జిల్లాల నుంచి మేడారం జాతరకు 3600 బస్సులు, రీజియన్ నుంచి 1,965 బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. గతంలో కంటే 15 నుంచి 20 శాతం అదనంగా బస్సులు నడపనున్నట్లు తెలిపారు. హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానం నుంచి 300 బస్సులు, కాజీపేట నుంచి 270 బస్సులు, వరంగల్ పాత మార్కెట్ నుంచి 330 బస్సులు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి 250 బస్సులు, హైదరాబాద్ నుంచి 60 బస్సులు, పరకాల నుంచి 180 బస్సులు, నర్సంపేట, కొత్తగూడ నుంచి 180 బస్సులు, తొర్రూరు నుంచి 150, మహబూబాబాద్ నుంచి 150, భూపాలపల్లి నుంచి 65 బస్సులు నడుపుతామని చెప్పారు. అదేవిధంగా మేడారంలో 29 క్యూ రెయిలింగ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీంతో పాటు రెస్ట్‌రూంలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, అనౌన్స్మెంట్ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. ఈ మేరకు బస్సులను సిద్ధం చేయాలని డిపో మేనేజర్లకు ఆర్ఎం సూచించారు. ప్రయాణికుల భద్రతపై అలసత్వం వద్దు.. ప్రయాణికుల భద్రతపై అలసత్వం వహిస్తే సహించేది లేదని, బస్సుల కండీషన్‌ను డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్ఎం యాదగిరి సూచించారు. డిపోల్లోని అన్ని బస్సులను డీఎంలు స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. 15 రోజుల్లో డిపోల్లోని అన్ని బస్సులను తనిఖీ చేయాలని, ఎక్కడెక్కడ సమస్య ఉందో గుర్తించి వాటిని మరమ్మతు చేయించి, వైరింగ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ప్రయాణంలో వైరింగ్ సమస్యతో మంటలు లేచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గేట్ మీటింగ్‌ల్లో డ్రైవర్లకు చెప్పాల న్నారు. మంటలు వ్యాపించిన వెంటనే ప్రయాణికులను బస్సులో నుంచి దింపడంతోపాటు బ్యాటరీ ద్వారా వచ్చే కనెక్షన్‌ను తొలగించాలని పేర్కొన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించేలా చూస్తూ ఆదాయాన్ని పెంచాలన్నారు. అదేవిధంగా వరంగల్, జనగామ, హన్మకొండ సిటీ బస్ స్టేషన్లను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ సీఎంఈ శ్రీధర్, డిప్యూటీ సీటీఎం భవానీప్రసాద్, తొమ్మిది డిపోల మేనేజర్లు పాల్గొన్నారు. -
అభివృద్ధి కాంతులు
గద్వాల, న్యూస్‌లైన్: నడిగడ్డ గద్వాల ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలిగింది. ఇక ఈ ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును గద్వాలకు సమీపం లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించారు. వీటికితో డు జూరాల ప్రాజెక్టు వద్ద జలవిద్యుదుత్పత్తి కేం ద్రం, లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రాల ని ర్మాణం జరిగింది. గద్వాల డివిజన్‌లోనే జూరాల,నెట్టెంపాడు, ఆర్డీఎస్ సాగునీటి ప్రాజెక్టులతో దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సాగునీరు సౌకర్యం పుష్కలంగా ఉన్న గద్వాల ప్రాంతంలోని ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటిని అందించే ఉద్దేశంతో రూ.110 కోట్లతో నిర్మించిన భారీ తాగునీటి పథకం త్వరలోనే మొదటిదశలో 31 గ్రామాలకు నీరు అందనుంది. ఇలా తాగు, సాగునీటి వనరులతో పాడి పరిశ్రమలో ముందడుగు వేసే పరిస్థితులు ఉండటంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గద్వాలలో ఇటీవల కొత్త దాణా ఫ్యాక్టరీకి శంకుస్థాపనచేశారు. ఇక్కడ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం కానుంది. వీటికితోడు గద్వాల ప్రాంత అభివృద్ధికి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రతిపాదనలో ఉన్న గద్వాల- రాయిచూర్ నూతన బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ ఇటీవల పూర్తయి ప్రారంభమైంది. మరిన్ని అభివృద్ధి పనులు ఇలా ప్రాజెక్టులు ఒకటి తర్వాత మరొకటి అం దుబాటులోకి వస్తుండటంతో, గద్వాల ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం రింగ్‌రోడ్డు ప నులు టెండర్ల దశలోనే ఉన్నాయి. త్వరలోనే ఈ రింగ్‌రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. గ ద్వాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యగా మారిన మొదటి రైల్వేగేటు వద్ద రూ.41కోట్ల అంచనావ్యయంతో ఆర్ఓబీ నిర్మాణానికి ఇటీవల టెం డర్లు పిలిచారు. ఇలా గద్వాల ప్రాంత అభివృద్ధి మరో ముందడుగుపడేలా రింగ్‌రోడ్డు, ఆర్ఓ బీల టెండర్లు ప్రారంభమయ్యాయి. దీనికితో డు గద్వాల నుంచి ఎర్రవల్లి చౌరస్తా(44వ జా తీయ రహదారి వరకు), గద్వాల నుంచి వయా మల్దకల్, అయిజ మీదుగా నాగల్‌దిన్నె వరకు రోడ్డును స్టేట్ హైవేగా గుర్తిస్తూ ప్రభుత్వం కొద్దినెలల క్రితం జీఓ జారీచేసింది. అలంపూర్ ని యోజకవర్గంలో కీలకమైన అలంపూర్ చౌరస్తా నుంచి బల్గెర వరకు ఉన్న రోడ్డును కూడా స్టేట్‌హైవేగా గుర్తించారు. ఈ రోడ్లను అభివృద్ధి చేస్తే ప్రగతికి మరింత దోహదపడుతుంది. నెట్టెం పాడు నుంచి అనుబంధంగా గట్టు మండలంలోనిపై ప్రాంతానికి సాగునీటిని అందించేలా గ ట్టు లిఫ్టుకు అనుమతి కోసం ఇప్పటికే సర్వే నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఇది మంజూరైతే ఇక కరువు ప్రాంతమంతా సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉంటుంది. ఆర్డీఎస్లో సాగునీరందని ప్రాంతానికి తుంగభద్ర నది నుంచి తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా సాగునీటిని అం దించేందుకు సర్వే నిర్వహించారు. ఈ పథకానికి కూడా మంజూరు లభిస్తే నడిగడ్డ అంతటా సాగు, తాగునీరు పుష్కలంగా లభిస్తుంది. -
పిల్లల కడుపు కొట్టొద్దు
నారాయణపేట రూ రల్, న్యూస్‌లైన్: సం క్షేమ వసతి గృహాల్లో నిరుపేద విద్యార్థుల కు నాణ్యమైన భోజ నంతో పాటు విద్య ను అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా అధికారులు మాత్రం పిల్లల కడుపు కొడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ ఆరోపించారు. సైకిల్‌యాత్రలో భాగంగా శుక్రవారం పట్టణంలోని వివిధ వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేరుకే సంక్షేమ హా స్టళ్లు ఉన్నాయని వాటిలో విద్యార్థుల కు మెనూ ప్రకారం నాణ్యమైన భోజ నం, మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. వసతి గృహాల్లో కలెక్టర్ తో పాటు అధికారులు బస చేయడ మే తప్పా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని వాపోయారు. రాత్రివేళ విద్యార్థులు దోమలతో రో గాల బారినపడుతున్నారన్నారు. హా స్టల్ విద్యార్థులకు మెస్‌చార్జీలను జనరల్ వసతి గృహాల్లో రూ.1,500, కళాశాల వసతి గృహాల్లో రూ. 2,500కు పెంచాలని డిమాండ్ చేశారు. సొంత భవనాలు నిర్మించాలని, మరుగుదొ డ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకా న్ని పడక్బందీగా అమలు చేయాల న్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, పెరి గిన ధరలకు అనుగుణంగా ఉపకార వేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్ పెంచాలన్నారు. సెప్టెంబర్ 3న కలెక్టరేట్ ముట్టడించనున్నామని, దీనికి ఎమ్మెల్సీ నాగేశ్వర్ హాజరవుతార న్నా రు. జిల్లావ్యాప్తంగా చేపట్టిన సైకిల్‌యాత్రలో తమ దృష్టికి వచ్చిన హా స్టల్ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీ సుకెళతామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భీంషప్ప, రవి తదితరులు పాల్గొన్నారు.