
'తెలంగాణలో 24గంటలపాటు మంచినీటి సరఫరా'
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలపాటు మంచినీటి సదుపాయాన్ని అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందుకోసం త్వరలో మంత్రులతో ఓ కేబినెట్ కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో జరుగుతున్న టీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగించారు.
దళితులు, గిరిజనులకు ఉచితంగానే మంచినీరు సరఫరా చేస్తామని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి సమాంతరంగా చేస్తామని చెప్పారు. ప్రజలతో మమేకమై ప్రజాప్రతినిధులు పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.