టీటీడీకి స్పష్టం చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా? రాదా? అనే అంశం పై సమాచార హక్కు కమిషన్(ఆర్టీఐ) చేస్తున్న విచారణను నిలిపేయడానికి హైకోర్డు నిరాకరించింది. ప్రస్తుత దశలో కమిషన్ విచారణలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో కమిషన్ ఇచ్చే ఉత్తర్వులు కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తాను కోరిన సమాచారాన్ని ఇచ్చేం దుకు టీటీడీ నిరాకరించడంపై డాక్టర్ వి.రాజగోపాల్ కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ సందర్భంగా పలు రికార్డులను తమ ముందు ఉంచాలని టీటీడీని కమిషన్ ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ టీటీడీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. టీటీడీ ప్రభుత్వ సంస్థ కాదని, అందువల్ల సమచార హక్కు చట్టం పరిధిలోకి రాదని టీటీడీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కమిషన్ చేస్తున్న విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.
విచారణలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
Published Tue, Mar 18 2014 4:42 AM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM
Advertisement