జిల్లాపరిషత్, న్యూస్‌లైన్ :
జిల్లాలో రెండేళ్లకోసారి జరిగే మేడారం సమక్క-సారలమ్మ జాతరలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రూపొందించి న నివేదికలపై రాష్ట్ర ప్లానింగ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ.ఠక్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఎస్. మహంతి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అరుుతే ప్రధాన కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న జాతర నిమిత్తం చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ * 25.61 కోట్లు, ఆర్ అండ్ బీ * 32.25 కోట్లు, ఇరిగేషన్* 29.06 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం * 16 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ *9.30కోట్లతోపాటు ఇతర శాఖలు తమ ప్రతిపాదనలను స్పెషల్ సీఎస్‌కు అందజేశారు. మొత్తం * 103 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు చేసినట్లు జిల్లాకు చెందిన అధికారులు తెలపగా... వారు అందజేసిన ఫైల్‌ను ఠక్కర్ క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిసింది.
ఐదు శాఖలు రూపొందించిన అంచనాలే *వంద కోట్లకు పైగా ఉండడం... మరికొన్ని శాఖల అంచనాలు కలిపితే మరో * 20 కోట్లు దాటే అవకాశాలు ఉండడంతో ఆయన... శాఖల వారీగా చేపట్టే పనులపై చర్చించారు. అధికారులు చెప్పిన సమాధానాలు సరిగా లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే మొక్కుబడిగా అంచనాలు రూపొందించారని.. ఇది సరికాదని అన్నట్లు సమాచారం. మరోసారి కిందిస్థారుులో పరిశీలనలు జరిపి అంచనాలు రూపొందించాలని సూచించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జి.కిషన్, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ ఎస్‌ఈలు మోహన్‌నాయక్, జి.సురేష్‌కుమార్, పద్మారావుతో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
మేడారం జాతరలో పర్యాటక శాఖ స్టాళ్లు
వడ్డేపల్లి : మేడారం జాతరలో పర్యాటక శాఖ ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం *1.50 లక్షల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవా రం ఉత్తర్వులు జారీచే సింది. 2014 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జాతర జరుగుతుంది. పర్యాటక ప్రాంతాలు, వసతుల వివరాలు స్టాళ్లలో అందుబాటులో ఉంటాయి.
మేడారం అంచనాలు సరిగా లేవ్..
Published Wed, Oct 9 2013 3:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement