వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సమైక్య ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తెలిపారు.
అనంత: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి నాయకత్వంలో సమైక్య ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తెలిపారు. ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలని కోరుతున్న తమ పార్టీ త్వరలో సమైక్య ఉద్యమాన్ని చేపడుతుందని గుర్నాథ్ రెడ్డి తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎంపీల చేతగానితనం వల్లే రాష్ట్ర విభజన జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు ఓట్లు-సీట్లు తప్పా ప్రజా సమస్యలు పట్టడం లేదని తెలిపారు. వైఎస్సార్ సీపీ అద్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రజాదరణ చూసి కాంగ్రెస్, టీడీపీలు ఓర్వలేకపోతున్నాయన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమైక్యవాదో..?విభజన వాదో తేల్చాలని గుర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.