ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: పత్తి రైతులపై ఒకవైపు ప్రకృతి పగబట్టింది. మరోవైపు సీసీఐ అధికారులు, ఇంకోవైపు దళారులు కత్తిగట్టారు. అంతి మంగా ఆ రైతులకు కన్నీరే మిగిలింది. పత్తికి గిట్టుబాటు ధర కల్పించి సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తామన్న అధికారుల హామీలు గాల్లో ‘దూది’ పింజాల్లా తేలి పోయాయి. గత సంవత్సరం జిల్లాలో పది కేంద్రా ల ద్వారా పత్తి కొనుగోలు చేసిన సీసీఐ అధికారు లు.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం ఐదిం టితోనే సరిపెట్టారు. ఇదే అదనుగా దళారులు దోపిడీకి తెర తీశారు. తమ ఇష్టానుసారంగా ధర నిర్ణయించి రైతులను నట్టేట ముంచుతున్నారు.ఈ ఏడా ది పత్తి క్వింటాలుకు రూ.4000లను మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధరకు సరుకును సీసీఐ కొనుగోలు చేయాల్సుంది. అక్టోబర్ రెండో వారం నుంచి ఈ పంట ఉత్పత్తి మొదటి తీత ప్రారంభమైంది. అమ్మకాలు కూడా అప్పుడే మొదలయ్యాయి.
ఈఏడాది12కేంద్రాలను (ఖమ్మం, నేలకొండపల్లి, ఏన్కూరు, వైరా, మధిర, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, ఇల్లెందు, చంద్రుగొండ, టేకులపల్లి, గార్ల) ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలుకురవడంతో చేతికందే దశకు వచ్చి న పత్తి పంట బాగా దెబ్బతిన్నది. వర్షాలు తగ్గాక నవంబర్ ఆరంభం నుంచి సీసీఐ కొనుగోళ్లు జరుపుతుందని రైతులు భావించారు. నవంబర్ మొదటి వారంలో సీసీఐ ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించి పంట స్థితిని పరిశీలించారు. పంట నాణ్యతను ఉన్నతాధికారులకు తెలుపుతామని, అనుమతి రాగా నే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ, ఒకవైపు.. సీసీఐ కేంద్రాల జాడ లేకపోవడం, మరోవైపు.. తడిసిన పత్తిని ఎక్కువ రోజు లు నిలువ ఉంచలేని పరిస్థితి ఏర్పడడంతోపాటు ఆర్థికావసరాలతో రైతులు తక్కువ ధరకే అమ్మకాలకు సిద్ధమయ్యారు. దీనిని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు.. సరుకు నాణ్యత లేదనే సాకుతో ధర ను బాగాతగ్గించారు. గరిష్టంగా రూ.3500కు మించి ధర పెట్టలేదు. ఈ దశలో, జిల్లా అధికారుల అభ్యర్థనతో డిసెంబర్ మొదటి వారంలో సీసీఐ అధికారులు ఎట్టకేలకు ఏన్కూరు, నేలకొండపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, చండ్రుగొండ మార్కెట్లలో కేం ద్రాలను ఏర్పాటు చేశారు. కానీ అప్పటికే ఎక్కువమంది రైతులుతమ పంటను అతి తక్కువ రేటుకు వ్యాపారులకు అమ్మేశారు.
సరుకు ఎక్కువగా అమ్మకానికి వచ్చే ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోళ్లు జరిపేందుకు సీసీఐ ఆలస్యంగా వచ్చింది. నిబంధనల మేరకు గన్నీ బస్తాలకు ధర చెల్లించాలని మార్కెట్ కమిటీ డిమాండ్ చేయడంతో ఖమ్మం మార్కెట్‌లో సీసీఐ కొనుగోళ్లు మిగతా కేంద్రాలతోపాటు ప్రారంభం కాలేదు. వీటి కారణంగా.. గత ఏడాదితో పోలిస్తే (అప్పుడు సీసీఐ 16లక్షల క్వింటా ళ్లు కొనుగోలు చేసింది) ఈ ఏడాది నాలుగోవంతు కూడా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. వర్షాల కారణంగా ఈ ఏడాది ఎకరాకు నాలుగు క్వింటాళ్లకన్నా ఎక్కువ దిగుబడి రాలేదు. ప్ర కృతి ప్రకోపంతో చితికిపోయిన తమను అటు ప్రభుత్వాధికారులు (సీసీఐ), ఇటు దళారులు (వ్యాపారులు) నిలువునా ముంచారని; అందరూ కలిసి తమపై కత్తిగట్టారని పత్తి రైతులు లబోదిబోమంటున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏవీ?
Published Fri, Dec 20 2013 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement