purchase centres
-
ప్రభుత్వ చర్యలపై అన్నదాతల్లో ఆనందం
-
కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
హైదరాబాద్: రైతులు ఇబ్బంది పడకూడదని, గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటామని ఇటీవల అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ.. యాసంగిలో భారీ విస్తీర్ణంలో వరి సాగు జరిగినందున రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్లాగే కొనుగోళ్లు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. యాసంగిలో పండనున్న వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 1.17 కోట్ల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 21 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన రూ.20 వేల కోట్ల రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లను మంగళవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. తక్షణం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కోరారు. హైదరాబాద్‌లోనే ఉండి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి, సీఎస్, అధికారులను ఆదేశించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 2,131, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఆధ్వర్యంలో 3,964, మరో 313 కేంద్రాలు కలిపి మొత్తం 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తేమ 17 శాతానికి మించకుండా చూసుకోవాలి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు.. కనీస మద్దతు ధర లభించేలా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కోరారు. వడ్లు ఎండబోసి, తాలు లేకుండా, తేమ 17 శాతానికి మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఆహార ధాన్యాల నిల్వల కోసం అదనపు గోదాములను నిర్మించేందుకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నందున, కార్పొరేషన్‌కు లీజుకు ఇవ్వడానికి స్థలాలను ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. మన పత్తికి మంచి డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని, మంచి క్వాలిటీ ఉండటమే దీనికి కారణమని కేసీఆర్ తెలిపారు. ఎక్కువ దిగుబడి వచ్చి.. అధిక ధర లభించే అవకాశం ఉన్నందున, వచ్చే వానాకాలం 75 నుండి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించడానికి సిద్ధం కావాలని సీఎం రైతులకు సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్ రెడ్డిని ఆదేశించారు. 20– 25 లక్షల ఎకరాల్లో కందిపంట సాగుకు చర్యలు చేపట్టాలని కోరారు. పత్తి, కంది పంటలకు నీళ్ల తడులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుందని సీఎం తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సెక్రటరీ భూపాల్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, ఎఫ్.సి.ఐ జనరల్ మేనేజర్ అశ్వినీగుప్తా పాల్గొన్నారు. 80 లక్షల టన్నులకు ఎఫ్‌సీఐ ఓకే యాసంగిలో భారీ విస్తీర్ణంలో వరి సాగైందని, ధాన్యం తీసుకోవాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను రాష్ట్రం కోరింది. ఈ మేరకు ఇటీవల ఎఫ్‌సీఐతో చర్చలు జరిపింది. దాంతో ఎఫ్‌సీఐ 80 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకునేందుకు సమ్మతించింది. ధాన్యం సేకరణకు 18 కోట్ల గోనె సంచులు అవసరం ఉండగా... 8 కోట్లు లభ్యతగా ఉన్నాయి. మిగతా 10 కోట్ల గోనె సంచుల కోసం పౌర సరఫరాల శాఖ ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు ఆర్డర్ ఇచ్చింది. కాగా గ్రేడ్–1 రకం ధాన్యానికి రూ. 1,888 మద్దతు ధర ఉండగా, కామన్ రకానికి 1,868 రూపాయలు ఉంది. ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం 6,506 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు జరిపింది. -
పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్ధం
కరీంనగర్‌సిటీ: పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) సిద్ధమయ్యింది. బహిరంగ మార్కెట్లో పత్తి పంటకు అధిక ధరలు పలుకుతున్న క్రమంలో నిన్నామొన్నటి వరకు ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ధరలు పతనమవుతున్న నేపథ్యంలో పత్తి పంటకు మద్దతు ధర కల్పిం చేందుకు సీసీఐ రంగంలోకి దిగింది. సీసీఐ ద్వారా జిల్లాలోని 4 మార్కెట్‌యార్డులు, 8 జిన్నింగ్ మిల్లుల్లో విడి పత్తి కొనుగోలు చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్‌శాఖ డీడీ పద్మావతి తెలిపారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌యార్డు, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర మార్కెట్‌యార్డుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శక్తి మురుగన్ ఇండస్ట్రీస్ (ఎలబోతారం), మల్లారెడ్డి కాటన్ ఇండస్ట్రీస్(మల్కాపూర్), రామినేని ఆగ్రో ఇండస్ట్రీస్ (రేణికుంట), ఆదిత్య కాటన్ అండ్ ఆయిల్ ఆగ్రో (జమ్మికుంట), రాజశ్రీ కాటన్ ఇండస్ట్రీస్ (జమ్మికుంట), మురుగన్ ఇండస్ట్రీస్ (జమ్మికుంట), శివశివాని కాటన్ ఇండస్ట్రీస్ (రుక్మాపూర్), కావేరి జిన్నింగ్ మిల్లు (వెలిచాల) జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు పత్తిని 12 శాతం తేమ మించకుండా.. నీరు చల్లకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించి మార్కెట్‌యార్డుకు లేదా జిన్నింగ్ మిల్లులకు తీసుకొచ్చి సీసీఐకి విక్రయించి మద్దతు ధర పొందాలని పద్మావతి కోరారు. సీసీఐ 8 నుంచి 12 శాతం లోపు తేమశాతం ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. 12 శాతం మించితే సీసీఐ కొనుగోలు చేయబోదని పేర్కొన్నారు. 8 శాతం కంటే తేమ ఎక్కువగా ఉన్నట్లయితే క్వింటాల్ పత్తికి రూ.5450లోపు చెల్లిస్తారని తెలిపారు. సీసీఐకి పత్తిని అమ్ముకునే రైతులు గత సంవత్సరం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా జారీ చేసిన పత్తి రైతు గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. గుర్తింపు కార్డు లేని పక్షంలో సంబంధిత వ్యవసాయ విస్తీర్ణాధికారి జారీ చేసిన పత్తి రైతు ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని పేర్కొన్నారు. గుర్తింపుకార్డు, ధ్రువీకరణ పత్రంతో పాటు పట్టాదారు పాసు పుస్తకం, పహాణి జిరాక్స్, ఆధార్‌కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా పుస్తకంలోని మొదటి రెండు పేజీలు జిరాక్స్ తీసుకుని రావాలని కోరారు. ఇప్పటివరకు జిల్లాలోని మార్కెట్ యార్డులో 46,354 క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారని తెలిపారు. పత్తి రైతులు నాణ్యతా ప్రమాణాలతో పత్తిని తీసుకువచ్చి సీసీఐ ద్వారా మద్దతు ధర పొందాలని కోరారు. -
కంది.. కదలనంటోంది!
సాక్షి, కురిచేడు : రెండేళ్లుగా కందులు రైతుల లోగిళ్లలో నిల్వ ఉన్నాయి. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిలబడినా రైతుకు మాత్ర ఫలితం దక్కలేదు. పరపతి సంఘాల్లోని అధికార పార్టీ నాయకులు సీరియల్లో ఉన్న తమకు మొండిచేయి చూపి వారి అనుయాయులకు ప్రాధాన్యమిచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. కందుల కేంద్రంలో కాకుండా బయట కూడా కాటా వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురిచేడు మండలంలోని కురిచేడు, ఎన్.ఎస్.పి.అగ్రహారం సహకార పరపతి సంఘాల పరిధిలోని కందుల కొనుగోలు కేంద్రాలకు టార్గెట్లు పూర్తయ్యాయంటూ మార్క్‌ఫెడ్ వారు ఏప్రిల్ 30 నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు. పడమర వీరాయపాలెం కొనుగోలు కేంద్రం ఒక్కటి మాత్రమే నిర్వహణలో ఉంది. దీంతో కందుల నిల్వలు ఉన్న రైతులంతా కలిసి కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖామంత్రి శిద్దా రాఘవరావు ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కానీ ఇంతవరకు అనుమతి రాకపోవటంతో కేంద్రాలు నిలిచిపోయి ఉన్నాయి. కానీ గడచిన సోమ, మంగళవారాలలో మార్కెట్ యార్డు పక్కన వున్న శ్రీనివాసనగర్‌లో ఓ రైతు ఇంటి వద్ద కందులు కొనుగోలు జరుగుతుండటంతో కలకలం రేగింది. కొందరు రైతులు వాటిని ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో గుట్టు రట్టయింది. అసలేం జరిగిందంటే..! కందుల కొనుగోలు కోసం కేంద్రాలు ప్రారంభించే ముందు ప్రభుత్వం అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించింది. కానీ అధికారులు మెట్ట భూముల్లో ఎకరానికి నాలుగు క్వింటాల్లు, మాగాణి భూములలో ఎకరానికి 7 క్వింటాళ్ల ప్రకారం దిగుబడి వస్తుందని ప్రభుత్వానికి తెలిపారు. ప్రభుత్వం అందులో సగం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి మెట్ట భూముల రైతులు నీరు అందుబాటులో ఉన్నంత వరకు ఎన్నో వ్యవ ప్రయాసలకు ఓర్చి మూడు కిలోమీటర్ల వరకు నీరు పెట్టి ఎకరానికి 7 క్వింటాళ్ల వరకు పండించారు. మాగాణి భూముల్లో 12 క్వింటాళ్ల వరకు పండించారు. దీంతో రైతుల వద్ద కందులు ఇబ్బడి ముబ్బడిగా మిగిలిపోయాయి. మిగిలిన కందులను ఏంచేయాలో అర్థంకాక, కొనుగోలు కేంద్రాల్లో కొనక, బయట తక్కువకు అడుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3500 టన్నులు కొనుగోలు చేశారు.. ఇప్పటి వరకు కురిచేడు కొనుగోలు కేంద్రం ద్వారా 3500 టన్నులు కందులు కొనుగోలు చేశారు. మరో 750 టన్నులకు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్.ఎస్.పి. అగ్రహారం కొనుగోలు కేంద్రం పరిధిలో 1800 టన్నులు కొనుగోలు చేశారు. మరో 1300 టన్నుల కొనుగోలుకు అనుమతి కావాలని కోరుతున్నారు. పడమర వీరాయపాలెం కొనుగోలు కేంద్రం పరిధిలో 650 టన్నులకు అనుమతి ఇచ్చారు. కొనుగోలు జరుగుతుంది. ఈ నెల 15 వరకు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖలు రాయటం జరిగింది. –జోత్స్నదేవి, కురిచేడు, ఏఓ రెండు నెలల తర్వాత వెనక్కు పంపారు మార్చి నెలలో 13వ తేదీ కందుల కొనుగోలుకు సీరియల్ ఇచ్చారు.కాని రెండు నెలల పాటు కాగితాలు వారి వద్ద ఉంచుకుని తిరిగి ఇప్పడు ఇచ్చారు. యార్డు మూసి వేసిన తరువాత అనుమతి కోసమంటూ మరలా కాగితాలు తీసుకుని అనుమతి వస్తుందని తెలిశాక వెనక్కు ఇచ్చారు. సమాధానం కూడా చెప్పలేదు. అధికార పార్టీ నాయకుల కందులు యార్డులో కాకుండా బయట కొంటున్నారు.– ఇందూరి సుబ్బారెడ్డి, రైతు, కురిచేడు ప్రభుత్వం కొనలేదు, బయట అమ్ముకోనీయలేదు ప్రభుత్వం అన్ని కందులు మేమే కొంటామని చెప్పి మోసం చేసింది. బయట అమ్ముకోనీయ కుండా చేసి చివరకు వాళ్లు కూడా కొనలేదు. నిరుడు కందులు కూడా ఉన్నాయి. రెండేళ్ల కందులు ఏమి చేసుకోవాలో అర్థం కావటం లేదు.అప్పులు పెరిగిపోయాయి.– పెనుగొండ రామిరెడ్డి, రైతు, కురిచేడు -
కొనుగోలు కేంద్రాలు ఏవీ?
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: పత్తి రైతులపై ఒకవైపు ప్రకృతి పగబట్టింది. మరోవైపు సీసీఐ అధికారులు, ఇంకోవైపు దళారులు కత్తిగట్టారు. అంతి మంగా ఆ రైతులకు కన్నీరే మిగిలింది. పత్తికి గిట్టుబాటు ధర కల్పించి సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తామన్న అధికారుల హామీలు గాల్లో ‘దూది’ పింజాల్లా తేలి పోయాయి. గత సంవత్సరం జిల్లాలో పది కేంద్రా ల ద్వారా పత్తి కొనుగోలు చేసిన సీసీఐ అధికారు లు.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం ఐదిం టితోనే సరిపెట్టారు. ఇదే అదనుగా దళారులు దోపిడీకి తెర తీశారు. తమ ఇష్టానుసారంగా ధర నిర్ణయించి రైతులను నట్టేట ముంచుతున్నారు.ఈ ఏడా ది పత్తి క్వింటాలుకు రూ.4000లను మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధరకు సరుకును సీసీఐ కొనుగోలు చేయాల్సుంది. అక్టోబర్ రెండో వారం నుంచి ఈ పంట ఉత్పత్తి మొదటి తీత ప్రారంభమైంది. అమ్మకాలు కూడా అప్పుడే మొదలయ్యాయి. ఈఏడాది12కేంద్రాలను (ఖమ్మం, నేలకొండపల్లి, ఏన్కూరు, వైరా, మధిర, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, ఇల్లెందు, చంద్రుగొండ, టేకులపల్లి, గార్ల) ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలుకురవడంతో చేతికందే దశకు వచ్చి న పత్తి పంట బాగా దెబ్బతిన్నది. వర్షాలు తగ్గాక నవంబర్ ఆరంభం నుంచి సీసీఐ కొనుగోళ్లు జరుపుతుందని రైతులు భావించారు. నవంబర్ మొదటి వారంలో సీసీఐ ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించి పంట స్థితిని పరిశీలించారు. పంట నాణ్యతను ఉన్నతాధికారులకు తెలుపుతామని, అనుమతి రాగా నే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ, ఒకవైపు.. సీసీఐ కేంద్రాల జాడ లేకపోవడం, మరోవైపు.. తడిసిన పత్తిని ఎక్కువ రోజు లు నిలువ ఉంచలేని పరిస్థితి ఏర్పడడంతోపాటు ఆర్థికావసరాలతో రైతులు తక్కువ ధరకే అమ్మకాలకు సిద్ధమయ్యారు. దీనిని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు.. సరుకు నాణ్యత లేదనే సాకుతో ధర ను బాగాతగ్గించారు. గరిష్టంగా రూ.3500కు మించి ధర పెట్టలేదు. ఈ దశలో, జిల్లా అధికారుల అభ్యర్థనతో డిసెంబర్ మొదటి వారంలో సీసీఐ అధికారులు ఎట్టకేలకు ఏన్కూరు, నేలకొండపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, చండ్రుగొండ మార్కెట్లలో కేం ద్రాలను ఏర్పాటు చేశారు. కానీ అప్పటికే ఎక్కువమంది రైతులుతమ పంటను అతి తక్కువ రేటుకు వ్యాపారులకు అమ్మేశారు. సరుకు ఎక్కువగా అమ్మకానికి వచ్చే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొనుగోళ్లు జరిపేందుకు సీసీఐ ఆలస్యంగా వచ్చింది. నిబంధనల మేరకు గన్నీ బస్తాలకు ధర చెల్లించాలని మార్కెట్ కమిటీ డిమాండ్ చేయడంతో ఖమ్మం మార్కెట్లో సీసీఐ కొనుగోళ్లు మిగతా కేంద్రాలతోపాటు ప్రారంభం కాలేదు. వీటి కారణంగా.. గత ఏడాదితో పోలిస్తే (అప్పుడు సీసీఐ 16లక్షల క్వింటా ళ్లు కొనుగోలు చేసింది) ఈ ఏడాది నాలుగోవంతు కూడా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. వర్షాల కారణంగా ఈ ఏడాది ఎకరాకు నాలుగు క్వింటాళ్లకన్నా ఎక్కువ దిగుబడి రాలేదు. ప్ర కృతి ప్రకోపంతో చితికిపోయిన తమను అటు ప్రభుత్వాధికారులు (సీసీఐ), ఇటు దళారులు (వ్యాపారులు) నిలువునా ముంచారని; అందరూ కలిసి తమపై కత్తిగట్టారని పత్తి రైతులు లబోదిబోమంటున్నారు.