విభజన ప్రక్రియ వడివడిగా జరుగుతున్న సమయంలో ఇంకా సమైక్యాంధ్ర కోసం పట్టుపట్టాలా..? లేక మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడాలా?
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘విభజన ప్రక్రియ వడివడిగా జరుగుతున్న సమయంలో ఇంకా సమైక్యాంధ్ర కోసం పట్టుపట్టాలా..? లేక మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడాలా?’ అని కేంద్రమంత్రి పురందేశ్వరి ప్రశ్నించారు. విశాఖలో శనివారం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు సమైక్య సెగ తగిలింది. సభలో కొంతమంది ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేస్తూ, నిరసన తెలిపారు. దాంతో మంత్రి మాట్లాడుతూ.. ‘‘సమైక్యమా? లేక హక్కులకోసం పోరాడదామా? మీరు ఏది చెబితే ఆ మార్గాన్ని ఎంచుకుంటా’’ అని పేర్కొన్నారు.