అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యపై అనుమానంతో భర్త కొట్టిన దెబ్బకు భార్య
ఆడమిల్లి (కామవరపుకోట) : అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యపై అనుమానంతో భర్త కొట్టిన దెబ్బకు భార్య అక్కడికక్కడే మృతి చెందింది. కామవరపుకోట మండలం ఆడమిల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆడమిల్లి సంజీవనగర్ కాలనీలో నివాసముంటున్న ప్రొద్దుటూరి శ్రీను, కుమారి దంపతులకు వివాహమై పన్నెండు సంవత్సరాలైంది. అయితే భార్యపై అనుమానంతో భర్త శ్రీను శనివారం రాత్రి కర్రతో తలపై కొట్టగా కుమారి(30) అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు డీఎస్పీ వెంకటరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనివాసయాదవ్, తడికలపూడి ఏఎస్సై దీక్షితులు డీఎస్పీ వెంట ఉన్నారు.