తాడేపల్లిగూడెం : పెదతాడేపల్లిలో ఈ నెల 14న సజీవ దహనైంఘటనలో మృతి చెందినది యువతా, మహిళా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు బాలికగా భావించి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాజాగా ఈ కోణంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది. సజీవ దహనమైన వ్యక్తికి 15 నుంచి 18 ఏళ్లు ఉంటాయని, యువతి లేదా బాలిక అవుతుందని తొలుత పోలీసులు భావించారు. ఈ క్రమంలో కనిపించకుండా పోయిన బాలికల వివరాలను సేకరించి, ఆ దిశగా దర్యాప్తు సాగిస్తూనే, ఆధునిక సాంకేతిక సహకారంతో కేసు మిస్టరీని ఛేదిం చడంలో నిమగ్నమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఆధార్‌తో మృతురాలి వేలిముద్రలను సేకరించి క్రోఢీ కరిస్తున్నారు.
పోస్టుమార్టం సందర్భంలో లభించిన సమాచారం మేరకు సజీవ దహనం అయ్యింది యువ తి కాదు, మహిళ అయి ఉండవచ్చనే కోణంలో దర్యా ప్తు సాగిస్తున్నట్టు తెలిసింది. మృతురాలి జుట్టుకు హెన్నా వేసి ఉందని సమాచారం. బెంగాలీ, మార్వాడీ మహిళలు, అదీ వయసు పైబడ్డవారు జుట్టుకు హెన్నా వాడుతుంటారు. ఇటీవల ఫ్యాషన్లతో జుట్టుకు ఎర్రరంగు వేయించుకునే అలవాటు పెరిగింది. సూపర్ ఇంపోజిషన్ ప్రక్రియతో ముఖం రూపురేఖలు తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన మద్యం బాటిళ్లపై ఉండే బ్రాండ్, హాలోగ్రామ్, బ్యాచ్ నంబర్ల ఆధారంగా కూడా కొన్ని వివరాలు లభ్యమైనట్టు తెలిసింది.
మృతురాలు.. యువతా? మహిళా?
Published Thu, Nov 27 2014 1:47 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement