నేడు నెల్లూరుకు సీఎం రాక | world women's day | Sakshi
Sakshi News home page

నేడు నెల్లూరుకు సీఎం రాక

Mar 8 2015 2:37 AM | Updated on Oct 20 2018 6:19 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం నెల్లూరుకు రానున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో బహిరంగసభను నిర్వహించనున్నారు.

నెల్లూరు (రవాణా): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం నెల్లూరుకు రానున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో బహిరంగసభను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అటు అధికారులు, ఇటు నేతలు పనిచేస్తున్నారు. గత వారంరోజులుగా సభా ప్రాంగణం ఏర్పాటులో అధికార యంత్రాంగం పనిచేస్తుంది. సుమారు లక్ష మందిని సభకు తరలించేలా టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పొంగూరు నారాయణ దగ్గరుండి సభ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లును చేస్తున్నారు.
 
  మహిళా సదస్సులో పలువురు మహిళా ప్రముఖులను సన్మానించనున్నారు. సభా ప్రాంగణం సమీపంలో పలు శాఖలకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో జరిగే సభకు ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు రానున్నారు. దేవినేని ఉమమహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత, పరిటాల సునీత, శ్రీనివాసరావు,  గోపాలకృష్ణారెడ్డి, మృణాళినితో పాటు నారాయణ సభకు హజరుకానున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement