ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.
ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన యువతి సూపర్ వాజ్మోల్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం వంకరకంట గ్రామానికి చెందిన అనిత(20)కు ఇటీవలే పెళ్లి నిశ్ఛయమైంది.
ఆ వివాహం యువతికి నచ్చకపోవడంతో.. ఆమె బంధువుల ఇంటికి వచ్చి సూపర్ వాజ్మోల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.