పూనకం వచ్చిన మహిళ చెప్పిందని.. | Young woman disappears in krishna district | Sakshi
Sakshi News home page

పూనకం వచ్చిన మహిళ చెప్పిందని..

Published Wed, Jul 19 2017 5:34 PM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

Young woman disappears in krishna district

కోడూరు(కృష్ణా): డిజిటల్‌ యుగంలో కూడా ఇంకా కొన్ని చోట్ల గ్రామస్థుల ఆచారాలు, కట్టుబాట్లలో ఎటువంటి మార్పు రావడం లేదు.  చేతబడులు, మూడనమ్మకాలు, పునకం వచ్చి దేవుడో/దేవతో చెప్పిన వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం జరుగువానిపాలెంలో ఓ యువతి అదృశ్యం తీవ్ర కలకలానికి కారణమైంది. గ్రామానికి చెందిన జరుగు సురేఖ మంగళవారం నుంచి కనిపించకుండా పోయింది.

యువతి కుటుంబ సభ్యులు ఓ పూనకం వచ్చిన మహిళకు విషయం చెప్పారు. అయితే, ఆమెను చంపి పొలాల్లో పాతేశారంటూ పూనకం వచ్చిన ఓ మహిళ చెప్పటంతో తీవ్ర కలకలం రేగింది. ఆ పూనకం వచ్చిన మహిళ చూపిన ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. ఎంత తవ్వినా గ్రామస్తులకు ఎటువంటి మృతదేహం ఆనవాళ్లు లభించలేదు. ఆ యువతి ఏమైంయిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement