disappears
-
అదృశ్యం అంటే.. ఇక అంతే
బిలియనీర్ల దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు, క్రీడాకారుల దగ్గర్నుంచి నటీనటుల వరకు అదృశ్యం కావడం చైనాలో సర్వ సాధారణంగా మారింది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన తర్వాత ఏ అవినీతి ఆరోపణలో చిక్కుకోవడమో, జైలుకు వెళ్లడమో లేదంటే లో ప్రొఫైల్‌లో ఉండడమో జరుగుతోంది. ఇలా అదృశ్యమైన వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ విదేశాంగ మంత్రిగా పని చేసిన చిన్‌గాంగ్ తాజాగా ఆ జాబితాలో చేరారు. నెలరోజులుగా ఆయన కనబడకుండా పోయినా ప్రభుత్వం పెదవి విప్పడం లేదు. ఆయన స్థానంలో వాంగ్ యీని విదేశాంగ మంత్రిగా నియమించింది. ఆ సమయంలోనూ చిన్‌గాంగ్ ఆచూకీపై మౌనం పాటించింది. చైనా ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారే ఇప్పటివరకు అదృశ్యమవుతూ వచ్చారు. కానీ చిన్‌గాంగ్‌ది దీనికి పూర్తిగా భిన్నం. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయనకు పేరుంది. రష్యా, వియత్నాం, శ్రీలంక నుంచి వచ్చిన అధికారులతో జూన్ 25న చివరిసారిగా ఆయన కనిపించారు. అప్పట్నుంచి ఎన్నో కీలకమైన సదస్సుల్ని చైనా వాయిదా వేసింది. కొన్ని సమావేశాలకు వాంగ్ యీ హాజరయ్యారు. చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు చిన్‌గాంగ్ గురించి తెలుసుకోవాలని ప్రయతి్నంచినా ‘నో రిజల్ట్స్ అన్న సందేశమే వస్తోంది. హాంగ్‌కాంగ్‌కి చెందిన మహిళా జర్నలిస్టు ఫు షియోన్‌తో వివాహేతర సంబంధమే చిన్‌గాంగ్ అదృశ్యానికి కారణమని తెలుస్తోంది. ప్రపంచంలోని రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసే ఆమె 2022లో చిన్గాంగ్ను ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. వివాహేతర సంబంధాలను చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుమతించదు. ఈ వ్యవహారం కారణంగానే అధ్యక్షుడితో చిన్‌గాంగ్‌కు విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. చిన్‌గాంగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్నిసార్లు ప్రభుత్వం చెబుతున్నా నమ్మేట్టు లేదు. అదృశ్యమైన ప్రముఖులు వీరే హు జింటావో చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య గత ఏడాది అక్టోబర్‌లో చైనీస్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి బలవంతంగా స్టీవార్డ్స్ బయటకు తీసుకువెళ్లడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రెండు నెలల పాటు ఆయన కనిపించకుండా పోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సమావేశం విడిచి వెళ్లారని ప్రభుత్వం అప్పట్లో వెల్లడించింది. రాజకీయ కారణాలతోనే అతన్ని సమావేశం నుంచి పంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్లో చైనా నాయకుడు జియాంగ్ జెమిన్ అంత్యక్రియల సమయంలో జింటావో కనిపించారు. జాక్ మా చైనాలో అత్యంత సంపన్నుడు, ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా 2020 చివర్లో కనిపించకుండా పోయారు. చైనా ప్రభుత్వ ఆర్థిక నియంత్రణలను విమర్శిస్తూ ప్రసంగించిన కొద్ది రోజుల్లోనే జాక్ మా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చైనా దర్యాప్తు సంస్థల నుంచి ఆయనకు సమన్లు అందాయి. ఆయన కొత్తగా పెట్టబోయే కంపెనీలకు అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. జాక్ మా సంపదలో సగానికి సగం కోల్పోయినట్టు అంచనా. అప్పట్నుంచి ఆయన ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టోక్యోలో ఉన్నారని తెలుస్తోంది. బావో ఫ్యాన్ చైనాకు చెందిన టెక్నాలజీ డీల్ మేకర్ బావో ఫ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. చైనా రనెసాన్స్ హోల్డింగ్స్ అనే ప్రైవేటు బ్యాంకు వ్యవస్థాపకుడైన బావోను చైనా ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు విచారిస్తున్నారంటూ ఆయన కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ దర్యా ప్తు సంస్థలు ఆయనని విచారిస్తున్నారో, కారణాలేంటో ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలీదు. గువో గ్వాంగ్‌చాంగ్ 2015లో అదృశ్యమైన అయిదుగురు ఎగ్జిక్యూటివ్‌లలో ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్ చైర్మన్ గువో గ్వాంగ్‌చాంగ్ ఉన్నారు. కొన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ తర్వాత హఠాత్తుగా ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. ఫుట్‌బాల్ క్లబ్‌కి యజమాని కూడా అయిన గ్వాంగ్‌చాంగ్‌ని అవి నీతి కేసుల్లో దర్యాప్తు సంస్థలు అదుపులోనికి తీసుకొని తర్వాత విడిచిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. రెన్ జికియాంగ్ చైనాలో రియల్ ఎస్టేట్ టైకూన్ రెన్ జికియాంగ్ 2020 మార్చిలో అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒక విదూషకుడు తరహాలో వ్యవహరించారంటూ వ్యాఖ్యానించిన కొద్ది రోజుల్లోనే ఆయన కనిపించకుండాపోయారు. ఏడాది తర్వాత అవినీతి ఆరోపణలపై ఆయనకు 18 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఫ్యాన్ బింగ్‌బింగ్ రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలతో పాటు చైనాలో నటీనటుల చుట్టూ అదృశ్యం మిస్టరీ నెలకొంది. 2018 జూలైలో ఫ్యాన్ బింగ్‌బింగ్ అనే నటీమణి హఠాత్తుగా కనిపించకుండాపోయారు. సోషల్ మీడియాకి ఆమె దూరమయ్యారు. బింగ్‌బింగ్ చైనా విడిచిపెట్టారని, గృహ నిర్బంధంలో ఉంచారన్న వదంతులు వ్యాపించాయి. దాదాపుగా ఏడాది తర్వాత బయటకు వచ్చిన ఆమె పన్నులు ఎగ్గొట్టినందుకు 8.83 కోట్ల యువాన్లు జరిమానా చెల్లించారు. పెంగ్ షూయీ చైనా టెన్నీస్ క్రీడాకారిణి పెంచ్ షూయీ 2022లో అదృశ్యమైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారి జాంగ్ గయోలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఆమె కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఆమె చైనాలోనే ఉంటున్నారని తెలుస్తోందికానీ లో ప్రొఫైల్‌లో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యం
-
తమ్ముళ్లను ఛీ కొట్టిన జనం..
జిల్లాలో ప్రతిపక్ష టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది.గత ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ, కడప, రాజంపేట పార్లమెంటు స్థానాల్లో ఘోర పరాజయం పాలైంది.కొన్ని నియోజకవర్గాల్లో నాలుగైదు సార్లు పోటీలో నిలిచినా ఓటమి తప్పలేదు. మరికొన్నిచోట్ల హ్యాట్రిక్ ఓటములను దక్కించుకున్న టీడీపీ జిల్లాలో కోలుకోలేని పరిస్థితికి చేరింది. సాక్షి, ప్రతినిధి కడప: గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని పులివెందుల, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, కమలాపురం, రాయచోటి, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, మైదుకూరు, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ తిరుగులేని విజయం సాధించింది. ఒక్క స్థానం నుంచి కూడా టీడీపీ గెలుపొందలేదు. కడప పార్లమెంటు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ అవినాష్‌రెడ్డి ఘన విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన సి.ఆదినారాయణరెడ్డి ఘోర ఓటమి చవిచూశారు. రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్ సీపీ పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఘన విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభ పరాజయం పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో టీడీపీకి భవిష్యత్తు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండడం గమనార్హం. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి, పి.రామసుబ్బారెడ్డి ఇద్దరు ఒక్కటైనా టీడీపీని గట్టెక్కించలేకపోయారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపున రామసుబ్బారెడ్డి పోటీలో నిలువగా, వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్‌రెడ్డి బరిలో నిలిచారు. సుధీర్‌రెడ్డి 1,24,201 ఓట్లు రాగా, రామసుబ్బారెడ్డికి కేవలం 72,856 ఓట్లు మాత్రమే వచ్చాయి. 51,345 ఓట్ల భారీ మెజార్టీతో సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. ఇద్దరూ ముఖ్య నేతలు ఒక్కటై టీడీపీకి మద్దతు పలికినా వైఎస్ జగన్ చరిష్మా ముందు వారికి ఘోర పరాభవం తప్పలేదు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేక చతికిల పడింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 90,110 ఓట్ల అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు. అసెంబ్లీ విషయానికి వస్తే పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబానికి ఓటమి లేదు. కడపలో డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా 52,539 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, రాయచోటిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి 32,679, రాజంపేటలో మేడా మల్లికార్జునరెడ్డి 29,990 మెజార్టీ, రైల్వేకోడూరులో కొరముట్ల శ్రీనివాసులు 34,510, మైదుకూరులో రఘురామిరెడ్డికి 29,674, కమలాపురంలో రవీంద్రనాథ్‌రెడ్డి 26,168, బద్వేలులో వెంకట సుబ్బయ్యకు 44,734, ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్‌రెడ్డి 43,148 ఓట్ల మంచి మెజార్టీలు లభించాయి. ఇక కడప పార్లమెంటునుంచి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి 3,80,976 ఓట్ల భారీ మెజార్టీ రాగా, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి 1,57,655 ఓట్ల మెజార్టీ లభించింది. ఈ మెజార్టీని చూస్తే టీడీపీకి నామమాత్రంగా కూడా ఓట్లు దక్కలేదని స్పష్టమవుతోంది. గతంలోనూ పరాభవాల పరంపర.. గడిచిన ఎన్నికల ఫలితాలు చూసినా టీడీపీకి ఘోర పరాజయాలు తప్పలేదని స్పష్టమవుతోంది. రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్ సీపీ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీకాంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 తర్వాత ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలిచిన పరిస్థితి లేదు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వరుసగా మూడుసార్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా విజయం సాధించగా 1999 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. కడప నుంచి డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా వైఎస్సార్ సీపీ తరపున రెండుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, 1999 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు. ప్రొద్దుటూరు నుంచి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి రెండుమార్లు గెలుపొందగా 2009 తర్వాత ఇక్కడ టీడీపీకి వరుస ఓటములు తప్పడం లేదు. కమలాపురం నుంచి పి.రవీంద్రనాథ్‌రెడ్డి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 తర్వాత ఇక్కడ టీడీపీకి విజయం లభించలేదు. మైదుకూరు నుంచి రఘురామిరెడ్డి వరుసగా రెండుసార్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. జమ్మలమడుగు నుంచి వరుసగా రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయం సాధించడం గమనార్హం. 1999 తర్వాత ఇక్కడ టీడీపీ విజయం సాధించలేదు. బద్వేలు నుంచి రెండుసార్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించగా, అంతకుముందు రెండుమార్లు సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రమే ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత వరుస ఓటములు తప్పలేదు. ఈ ఫలితాలు చూస్తే టీడీపీ జిల్లాలో మరింత పతనమైన పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల ఓటమి అనంతరం ఆ పార్టీ క్యాడర్ నిర్వీర్యమై పోయింది. మొక్కుబడిగా కూడా నేతలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కిందిస్థాయి క్యాడర్ కార్యక్రమాలకు పూర్తిగా దూరమైంది. జిల్లాలోని పది అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న అరకొర నేతల మధ్య వర్గ విబేధాలు పతాక స్థాయికి చేరాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జిల్లాకు చెందిన సీఎం రమేష్, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిలు టీడీపీని వీడి షెల్టర్ జోన్ బీజేపీలో చేరగా మిగిలిన నేతలు ఆ పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరమయ్యారు. దీంతో జిల్లాలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ›ప్రతిపక్ష నేత చంద్రబాబు సోమవారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బాబు ఎంత కసరత్తు చేసినా జిల్లాలో టీడీపీ మళ్లీ పుంజుకునే పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
యువతి అదృశ్యం
కర్నూలు : కల్లూరులోని గంగావతి నగర్లో నివాసముంటున్న ఆంజనేయులు కుమార్తె రామాంజనమ్మ (24) అదృశ్యమైంది. పోలీసుల వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం ఫేస్‌క్రీమ్ తెచ్చుకుంటానని బయటకు వెళ్లిన రామాంజనమ్మ తిరిగిరాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికినా ఆచూకీ లభించలేదు. సుమారు 5 అడుగుల ఎత్తు, కోల ముఖం, చామన ఛాయ కల్గి ఉంది. ఆచూకీ తెలిసిన వారు 8519894597 నంబర్లో సమాచారం అందించాలని నాలుగో పట్టణ పోలీసులు కోరారు. -
సోమాలియాలో..పశ్చిమ జిల్లా యువకుడు అదృశ్యం
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన జిల్లాకు చెందిన ఒక యువకుడి ఆచూకీ గల్లంతైంది. అప్పటివరకు తాను ఉద్యోగం నిర్వహించిన నౌకలోనే అతడు మాయం కావడం మిస్టరీగా మారింది. ఇది కిడ్నాపా.. లేక ఏదైనా ప్రమాదమా.. అనే విషయంలో స్పష్టతలేక అయోమయం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి, పెనుమంట్ర: మండలంలోని నెగ్గిపూడికి చెందిన నక్కా భరత్ నాగేంద్ర మణికంఠ ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం ఇండియా నుంచి దుబాయ్ వెళ్లాడు. అక్కడ మర్చంట్ నేవీలో కెఫ్టెన్కు సహాయకుడిగా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో భాగంగా అతడు ఈ నెల 8వ తేదీ దుబాయ్ నుంచి సోమాలియా మీదుగా మస్కట్ దేశానికి నౌకలో ప్రయాణం సాగిస్తున్నాడు. కాగా ఈ నెల 16వ తేదీ రాత్రి షిష్టు ఉద్యోగంలో ఉన్న సమయంలో సోమాలియాలో అతడు ఆచూకీ గల్లంతైనట్టు తెలుస్తోంది. సదరు విషయాన్ని అతని సహ ఉద్యోగి అయిన గుంటూరు జిల్లాకు చెందిన శివ, నెగ్గిపూడిలోని మణికంఠ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అప్పట్నుంచి తీవ్ర మనో వ్యధకు గురైన కుటుంబీకులు పలు విధాలుగా సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు. కుటుంబ నేపథ్యం ఇదీ.. మణికంఠ తండ్రి నక్కా దుర్గాప్రసాద్ సౌదీలో డ్రైవరుగా పనిచేస్తున్నారు. తల్లి ఝాన్సీలక్ష్మి గృహిణి. మణికంఠ నరసాపురంలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి అనంతరం మిత్రుల సలహాతో చెన్నై వెళ్లి అక్కడ శిక్షణ పొందాడు. అక్కడ నుంచి దుబాయ్‌కి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. అక్కడ షిప్‌యార్డులో ఉద్యోగం చేస్తూ షిప్లో కెప్టెన్‌కు సహాయకుడిగా గతేడాది అక్టోబర్ నెలలో ఉద్యోగం ప్రారంభించాడు. మణికంఠ అక్క ప్రమీలాదేవి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తమ్ముడు చందు సాయిరాం నెగ్గిపూడిలోనే ఉంటూ చదువుకుంటున్నాడు. రాయబారి అధికారులకు వేడుకోలు మణికంఠ ఆచూకీ కోరుతూ అతని తండ్రి దుర్గాప్రసాద్ దుబాయ్‌లో భారత రాయభార కార్యాలయం వద్ద తన ఆవేదన వినిపించాడు. అలాగే మనదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఉన్నతాధికారులకు కూడా మొరపెట్టుకున్నాడు. తన కుమారుడి ఆచూకీ తెలపాలని కోరుతూ వివరాలు అందజేశాడు. మంత్రి పితానికి మొరపెట్టుకున్న తల్లి కాగా గురువారం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణను మణికంఠ తల్లి ఝాన్సీలక్ష్మి, సోదరి ప్రమీలారాణి కలసి మణికంఠ మిస్సింగ్ విషయాన్ని విన్నవించారు. అలాగే మణికంఠ తమ్ముడు చందు సాయిరాం ఏలూరులో కలెక్టర్ భాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మొత్తంగా ఈ సంఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. -
కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఆడశిశువు అదృశ్యం
-
పూనకం వచ్చిన మహిళ చెప్పిందని..
కోడూరు(కృష్ణా): డిజిటల్ యుగంలో కూడా ఇంకా కొన్ని చోట్ల గ్రామస్థుల ఆచారాలు, కట్టుబాట్లలో ఎటువంటి మార్పు రావడం లేదు. చేతబడులు, మూడనమ్మకాలు, పునకం వచ్చి దేవుడో/దేవతో చెప్పిన వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం జరుగువానిపాలెంలో ఓ యువతి అదృశ్యం తీవ్ర కలకలానికి కారణమైంది. గ్రామానికి చెందిన జరుగు సురేఖ మంగళవారం నుంచి కనిపించకుండా పోయింది. యువతి కుటుంబ సభ్యులు ఓ పూనకం వచ్చిన మహిళకు విషయం చెప్పారు. అయితే, ఆమెను చంపి పొలాల్లో పాతేశారంటూ పూనకం వచ్చిన ఓ మహిళ చెప్పటంతో తీవ్ర కలకలం రేగింది. ఆ పూనకం వచ్చిన మహిళ చూపిన ప్రదేశంలో తవ్వకాలు జరిపారు. ఎంత తవ్వినా గ్రామస్తులకు ఎటువంటి మృతదేహం ఆనవాళ్లు లభించలేదు. ఆ యువతి ఏమైంయిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. -
మతిస్థిమితం లేని యువతి అదృశ్యం
హైదరాబాద్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన ఓయూ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. హబ్సిగూడలో ఉండే అన్నపూర్ణ కుమార్తె జన్ను మానస(19)కు మతిస్థిమితం లేదు. ఆమె శనివారం సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ప్రధాన రహదారిపై ఓ ఆటో ఎక్కిన ఆమెను... ఎక్కడకు వెళ్లాలని ఆటో డ్రైవర్ అడిగాడు. సరైన సమాధానం చెప్పక పోవడంతో ఆటో డ్రైవర్ ఆమెను అక్కడే రోడ్డుపై వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా మానస కనిపించకపోవడంతో అన్నపూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీ సులు తెలిపారు. కాగా, మానస ఇటీవల మరణించిన ‘సాక్షి’ టీవీ రిపోర్టర్ జె.శ్రీనివాసులు(జెస్సీ) కుమార్తె. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు పసుపు రంగు పంజాబీ డ్రెస్ వేసుకుంది. ఆచూకీ తెలిసిన వారు ఓయూ పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. -
వీడియోకోసం గంగలో దూకాడు..
సెల్ఫీలు, వీడియోల పిచ్చి మరోప్రాణాన్ని బలిగొంది. ప్రతి విషయాన్నీ తమ స్మార్ట్ ఫోన్, కెమెరాల్లో బంధించాలన్న వేలం వెర్రితో తాజాగా గంగానదిలో దూకుతూ స్నేహితులతో వీడియో తీయించుకున్నఓ వ్యక్తి.. ఏకంగా కనిపించకుండానే పోవడం ఆందోళన కలిగించింది. ప్రతి విషయాన్ని రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్న నేపథ్యంలో జరిగిన ఘటన వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. హరిద్వార్ కు దగ్గరలోని గంగానదిలో దూకిన వ్యక్తి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. స్నేహితుడి వీడియోను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేయాలన్న తపనే తప్పించి, అతడేమయ్యాడో పట్టించుకునే పరిస్థితి వారిలో కనిపించకపోవడం ఆందోళన నింపుతోంది. బాగా మద్యం సేవించిన 27 ఏళ్ళ వ్యక్తి గంగా నదిలో దూకుతూ వీడియో తీయించుకోడానికి ముందుగా కాస్త ఆలోచించినా.. తర్వాత స్నేహితుల ప్రోత్సాహంతో అనుకున్నంతపనీ చేశాడు. ఈతకొట్టుకుంటూ తిరిగి బయటకు వద్దామనుకొని గంగానదిలో దూకిన వ్యక్తి , నీటిలో మునిగి కనిపించకుండా పోయాడు. స్నేహితులు తీసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రాబాద్ గాంధ్ మిర్పూర్ కు చెందిన 27 ఏళ్ళ ఆశిష్ చౌహాన్ గంగ్ నహర్ లోని గంగా నదిలో మునిగిపోయి 48 గంటలు దాటినా బాడీ దొరకలేదు. తన స్నేహితులు అశ్విని చౌహాన్, బాలరాజ్ కుమార్ లతో కలసి ఎప్పట్లాగే గంగా నది ప్రాంతానికి వెళ్ళిన ముగ్గురూ అక్కడి గట్టుపై కూర్చున్నారు. ముందు బాగానే ఉన్నా ఆ స్నేహితులంతా కలసి మద్యం సేవించిన అనంతరం చౌహాన్ నదిలో దూకి ఈత కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఆ దృశ్యాన్ని రికార్డు చేయాలని ఆదేశించాడు. ముందు కొంత ఆలోచించినా.. చౌహాన్ చివరికి నదిలో దూకడానికి సిద్ధమయ్యాడు. స్నేహితులు వీడియో తీస్తూ ఉండిపోయారు. అయితే దూకిన వ్యక్తి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళనలో పడ్డారు. అతడి జాడ తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వారిద్దరూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, సహాయక సిబ్బందితో సహా నదిలో గాలించినా ఫలితం కనిపించకపోవడంతో చౌహాన్ స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా కలసి ఎన్నోసార్లు గంగానదిలో ఈత కొడుతుంటామని, చౌహాన్ మంచి ఈతగాడని చెప్తున్నారు. చౌహాన్ నదిలో దూకే సమయంలో స్నేహితులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా... కొన్ని టీవీ ఛానెల్స్ కూడ ప్రసారం చేశాయి. నీటి ప్రవాహంలో చౌహాన్ శరీరం కొట్టుకుపోయి ఉండొచ్చని అది ఎక్కడో ఓచోట బయటకు వస్తుందని భద్రాబాద్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అమర్ చంద్ర శర్మ తెలిపారు. చౌహాన్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదని, విషయంపై చౌహాన్ కుటుంబానికి సమాచారం అందించగా.. ఎవ్వరిపైనా అనుమానం వ్యక్తం చేయడం గాని, ఆరోపించడం గాని చేయలేదని తెలిపారు. ఇది ప్రమాద వశాత్తు జరిగిన ఘటనగానే కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు పోలీస్ అధికారులు వివరించారు. -
కొత్త పెళ్లికొడుకు పరార్!
ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలలకే తల్లిదండ్రులు గుర్తొస్తున్నారంటూ వరుడు పరారయ్యాడు. దాంతో అతడి భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆ సంఘటన హైదరాబాద్ శివారులోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కన్నీరు రాజు, అల్మాస్‌గూడకు చెందిన లక్ష్మి ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి రెండు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అల్మాస్‌గూడలోని రాజీవ్ గృహకల్పలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. అయితే రాజు తనకు తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారని, చూసి వస్తానని భార్య లక్ష్మికి చెప్పి ఈ నెల 12న ఇంటి నుంచి వెళ్లాడు. అంతే.. తర్వాత అతడి సమాచారం వస్తే ఒట్టు. దాంతో రాజు భార్య ఆందోళన చెంది, భర్త ఆచూకీ కోసం ప్రయత్నించింది. అయినా అతడి ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.