సఖినేటిపల్లి : తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని ఫెర్రీ ఘాట్‌లో కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ యువకుడు శనివారం గల్లంతయ్యాడు. గుడివాడకు చెందిన కామరాజు దీక్షిత్ (18) కుటుంబ సభ్యులతో కలసి శనివారం సఖినేటిపల్లికి వెళ్లారు. దీక్షిత్ తండ్రి పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు గోదావరిలో దిగారు. వెంట దీక్షిత్, మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఈ క్రమంలో దీక్షిత్ ప్రమాదవశాత్తు గోదావరి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గోదావరిలో కృష్ణా జిల్లా వాసి గల్లంతు
Published Sat, Jul 18 2015 4:42 PM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement
Advertisement