
పాదయాత్రలో వైఎస్ జగన్
సాక్షి, రామచంద్రాపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 205వ రోజు షెడ్యూలు ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ బుధవారం ఉప్పుమిల్లి శివారు నుంచి ప్రాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కుయ్యేరు, బాలాంత్రం, ఎర్రపోతవరం, వేగాయమ్మ పేట మీదుగా ద్రాక్షారామం వరకు పాదయాత్ర కొనసాగనుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు.
ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వర్షం అంతరాయంతో జననేత నేటి పాదయాత్ర మధ్యాహ్నాం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. కోలంక శివారు నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర ఉప్పుమిల్లిలో ముగిసింది.