
ధైర్యవంతుడైన అధికారిని కోల్పోయాం- వైఎస్ జగన్
హైదరాబాద్: ఎస్ఐ సిద్ధయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఒక ధైర్యవంతుడైన పోలీసు అధికారిని కోల్పోయామని ఆయన తెలిపారు.
నల్గొండ జిల్లా జానకీపురంలో శనివారం ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య మంగళవారం సాయంత్రం మరణించారు. నాలుగు రోజులుగా ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు కృషి చేసినా ఫలితం లేకపోయింది.