
పెళ్లి రోజే ప్రాణాలు కోల్పోయాడు
హైదరాబాద్: ఎస్ఐ సిద్ధయ్య మరణం వారి కుటుంబంలో అంతులేని విషాదాన్నినింపింది. నల్గొండ జిల్లా జానకీపురంలో ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య మంగళవారం తుది శ్వాస విడిచారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ఆయన పెళ్లి చేసుకున్నారు.
శనివారం కాల్పుల్లో గాయపడిన సిద్ధయ్యను ఆస్పత్రికి తరలించాకా.. అదే రోజు రాత్రి ఆయన భార్య ధరణి మగబిడ్డకు జన్మనిచ్చారు. సిద్ధయ్య చికిత్స పొందుతున్న కామినేని ఆస్పత్రిలోనే ఆమె ప్రసవించారు. ఆ సమయంలో సిద్ధయ్య మృత్యువుతో పోరాడుతున్నారు. తాను తండ్రయ్యానన్న విషయం తెలుసుకోకుండానే.. బిడ్డను చూడకుండానే.. పెళ్లయిన ఏడాదికే సిద్ధయ్య మరణించడం.. అందర్నీ కలచివేసింది.