
సిద్ధయ్యది వీరమరణం: కేసీఆర్
హైదరాబాద్: ఎస్ఐ సిద్ధయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధయ్య కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. సిద్ధయ్య ప్రాణాలకు తెగించి పోరాడారని, ఆయనది వీరమరణమని కేసీఆర్ నివాళులు అర్పించారు. పోలీసుల అంకితభావానికి సిద్ధయ్య ప్రతీకని కేసీఆర్ పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా జానకీపురంలో శనివారం ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య మంగళవారం సాయంత్రం మరణించారు. నాలుగు రోజులుగా ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు కృషి చేసినా ఫలితం లేకపోయింది.