పదేళ్ల సాక్షికి శుభాభినందనలు : వైఎస్‌ జగన్‌ | Ys Jagan Mohan Reddy Best Wishes To Sakshi Team | Sakshi
Sakshi News home page

శుభాకాంక్షలు

Published Sat, Mar 24 2018 1:56 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

Ys Jagan Mohan Reddy Best Wishes To Sakshi Team

తెలుగు నేలపై ఒక వర్గం మీడియా గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ పదేళ్ల కిందట పుట్టింది సాక్షి. నాణేనికి బొమ్మతో పాటు బొరుసు కూడా ఉంటుంది. దాన్ని కూడా జనానికి తెలియజేయాలనేదే ‘సాక్షి’ని ఆరంభించటానికి ప్రధాన కారణం. ఆనాటి చైర్మన్‌గా నా ఆలోచన అదే. సహజంగానే చాలామందికి అది నచ్చలేదు. ఫలితంగా సాక్షిని దెబ్బతీయటానికి ఎన్నెన్నో కుట్రలు జరిగాయి. అన్నిటినీ ఎదుర్కొంటూ అలుపెరుగని చరిత్రాత్మక పోరాటం సాగించింది సాక్షి. 

మరోవైపు... పత్రికగా తన ధర్మాన్ని నూరు శాతం పాటించింది. ఎన్నెన్నో కుంభకోణాల్ని బయటపెట్టింది. అక్రమార్కుల గుట్టు రట్టు చేసి వారి నిజ స్వరూపాలను పాఠకులకు చూపించింది. వ్యవస్థల్లోని లొసుగుల్ని కళ్లకు కట్టింది. ఎందరో విద్యార్థుల విజయానికి మెట్టుగా మారింది. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని ఒడిసి పట్టుకుని... కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ... తిరుగులేని మీడియా సంస్థగా ఆవిర్భవించింది. విలువలకు కట్టుబడి... పాత్రికేయ ధర్మాన్ని నిబద్ధతతో కొనసాగిస్తున్న సాక్షికి... పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇవే నా శుభాభినందనలు. ఇదే దీక్ష, నిబద్ధతలతో తెలుగువారి మనస్సాక్షిగా ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

మీ..
వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement